Begin typing your search above and press return to search.

పిక్ టాక్ :​ హనుమాన్ హీరో రాయల్​ లుక్​..

బాల నటుడిగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ నటుడు తేజ సజ్జా. చూడాలని ఉంది చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో మెరిశాడు

By:  Tupaki Desk   |   7 Oct 2023 6:03 AM GMT
పిక్ టాక్ :​  హనుమాన్ హీరో రాయల్​ లుక్​..
X

బాల నటుడిగా తెరంగేట్రం చేసి ప్రస్తుతం హీరోగా రాణిస్తున్న టాలీవుడ్ నటుడు తేజ సజ్జా. చూడాలని ఉంది చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసి.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో మెరిశాడు. తన ముద్దు ముద్దు మాటలు ఇనోసెంట్​ ఫేస్​తో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భారీ బడ్జెట్​ హనుమాన్​ చిత్రంతో బిజీగా ఉన్న అతడు.. ఆ సినిమా ప్రమోషన్స్​ కోసం రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ సూపర్ ఫొటోషూట్ చేశాడు.


పింక్ కలర్ సిల్క్ సాలిడ్ ఎంబ్రాయిడ్​ కుర్తా - వైట్ ప్యాంట్, చేతికి కాస్ట్లీ వాచ్​ ధరించి స్టన్నింగ్ లుక్​లో డ్యాపర్ ఛార్మ్​గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఒక ఫొటోలో రెండు చేతులను జేబులో పెట్టుకుని కనిపించగా.. మరో ఫొటోలో మీసాలు మెలేస్తూ కనిపించాడు. మరో పిక్​లో స్టైలిష్​గా పోజులిచ్చాడు. మొత్తంగా ఈ పిక్స్​లో ఎంతో రాయల్​గా స్వాగ్​తో కనిపించాడు. ఈ పిక్స్​ నెటిజన్లను, సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

కాగా, రాజకుమారుడు, కలిసుందాం.. రా, యువరాజు, ఇంద్ర, గంగోత్రి, వసంతం, ఠాగూర్‌, బాలు తదితర చిత్రాల్లో బాల నటుడిగా సందడి చేసిన తేజ సజ్జా.. జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఇష్క్‌, అద్భుతం వంటి చిత్రాలతో అలరించాడు. ప్రస్తుతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్​ హనుమాన్‌లో నటించాడు.

దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతికి బడా సినిమాలతో పోటీ పడనుంది. ఈ చిత్రాన్ని దాదాపు 11 భాషల్లో రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. జాంబీరెడ్డి తర్వాత తేజ సజ్జ, ప్రశాంత్‌ వర్మల కాంబోలో తెరకెక్కనున్న చిత్రమిది.

కె నిరంజన్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటించింది. గతంలో రిలీజైన టీజర్​ కూడా మిలియన్‌ వ్యూస్​తో అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. అంజనాద్రి అనే ఓ కల్పిత ప్రదేశం నేపథ్యంలో సాగే చిత్రమని మూవీటీమ్ చెబుతోంది. హీరో.. హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో సినిమా రూపొందింది.