వాళ్లకు చెక్కులు ఇస్తున్న విజయ్ దేవరకొండ..!
ఖుషి సినిమా సక్సెస్ అయిన సందర్భంగా వైజాగ్ లో జరిగిన సక్సెస్ ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన సక్సెస్ ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకోవాలని అనుకున్నాడు.
By: Tupaki Desk | 14 Sep 2023 5:49 AM GMTవిజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్ లో వచ్చిన ఖుషి ముందు టాక్ బాగానే తెచ్చుకున్నా వసూళ్ల పరంగా నిరాశపరచింది. వీకెండ్ వరకు బాగానే నడిచినా మండే రోజు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. అయితే సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ తో విజయ్ దేవరకొండ సంతోషపడ్డాడు. ఈ క్రమంలో జరిగిన వైజాగ్ ఈవెంట్ లో ఫ్యాన్స్ కి కోటి రూపాయలు గిఫ్ట్ గా ఇస్తానని చెప్పాడు. కోటి రూపాయలు 100 మందికి ఒక్కొక్కరికి లక్ష గిఫ్ట్ గా ఇస్తానని అనౌన్స్ చేశాడు. విజయ్ దేవరకొండ ఇచ్చిన ఈ అవకాశాన్ని వాడుకునేందుకు చాలా మంది ప్రయత్నించారు.
రెండు వారాల క్రితం ఈ అప్లికేషన్స్ అన్నీ చూసి అందులో 100 మంది లక్కీ ఫ్యాన్స్ కి లక్ష రూపాయల చొప్పున విజయ్ అందించనున్నారు. నేడు విజయ్ ఆ కార్యక్రమాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది. 100 మంది లక్కీ ఫాన్స్ కి విజయ్ లక్ష రూపాయల చెక్కులను ఇవ్వనున్నారు. ఖుషి సినిమాను శివ నిర్వాణ డైరెక్ట్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగుతో పాటుగా తమిళంలో కూడా మంచి సక్సెస్ అందుకుంది.
డియర్ కామ్రేడ్ నుంచి లైగర్ వరకు వరుస ఫ్లాపులతో కెరీర్ లో బ్యాడ్ టైం నడుస్తుందని భావించిన విజయ్ దేవరకొండ ఖుషి కి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే సినిమా అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించలేదు. నైజాం లో తప్ప మిగిలిన అన్ని చోట్ల కొద్దిపాటి లాసులు తప్పలేదు. అయితే డియర్ కామ్రేడ్ నుంచి చూస్తే ఈ మాత్రం టాక్ కూడా దేనికి రాలేదు. అందుకే సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఖుషి ఈవెంట్ లో తను చేసిన కోటి రూపాయల ప్రామిస్ ని నెరవేర్చుతున్నాడు విజయ్ దేవరకొండ.
అందుకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అంతా జరిగి అప్లై చేసుకున్న వారందరిలో 100 మందిని సెలెక్ట్ చేసి వారికి లక్ష చెక్ ని అందించనున్నారు. హైదరాబాద్ లో ఒక ఈవెంట్ గా ఈ కార్యక్రమం జరుగనుంది. ఇక విజయ్ తన నెక్స్ట్ సినిమా పరశురామ్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.