నిర్మాతల మండలికి విశాల్ వార్నింగ్!
ఇకపై విశాల్ తో సినిమాలు చేసే నిర్మాతలు కచ్చితంగా తమను సంప్రదించాలని పేర్కొంది. దీనికి కౌంటర్ గానే విశాల్ పై విధంగా స్పించాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే?
By: Tupaki Desk | 11 Aug 2024 5:08 AM GMTతమిళ నిర్మాతల మండలికి నటుడు విశాల్ అల్టిమేటం జారీ చేసాడు. తనపై చేసిన తీర్మానాన్ని 24 గంటల్లో వెనక్కి తీసుకోవాలని హెచ్చిరించాడు. లేకుంటే చట్టపరమైన చర్యలకు దిగుతానని విశాల్ మండలిని ఉద్దేశించా వ్యాఖ్యానించాడు. దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతల మండలితో విశాల్ లొల్లి ఏంటి? అని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే..
గతంలో నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పనిచేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో అవకతవకలు జరిగాయని, మండలి నిధుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ప్రస్తుత మండలి ఆరోపించింది. ఇకపై విశాల్ తో సినిమాలు చేసే నిర్మాతలు కచ్చితంగా తమను సంప్రదించాలని పేర్కొంది. దీనికి కౌంటర్ గానే విశాల్ పై విధంగా స్పించాడు. ఇంకా ఆయన ఏమన్నాడంటే?
`మండలి నిబంధనలకు అనుగుణంగానే అప్పటి కార్యవర్గం బాద్యతలు నిర్వహించిన కదిరేషన్, ఇతర సభ్యుల అంగీకారంతోనే సభ్యుల సంక్షేమం కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాం. వారి బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేసాం. ప్రత్యేక ఆడిటర్ చేసిన ఆరోపణల విషయంలో నన్ను వివరణ కోరలేదు. కార్యవర్గం తీర్మానంతోనే ఇళయరాజా 75 పేరుతో సంగీత విభావరి నిర్వహించి, నిర్మాతల మండలికి మంచి పేరు తీసుకొచ్చాం.
వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మండలి కార్యాలయలో ఉన్నాయి. అలాంటిది మీకే ఏ అధికారం ఉందని నాతో సినిమాలు నిర్మించే నిర్మాత, దర్శకుల్ని మీతో చర్చించాలని తీర్మానం చేస్తారు` అని అసహనం వ్యక్తం చేసాడు. ఇప్పటికే నిర్మాంతల మండలి తీరుపై నడిగర్ సంఘం కూడా మండిపడిన సంగతి తెలిసిందే. అలాగే సౌత్ ఇండస్ట్రీ అసోసియేషన్ నటుల సంఘం కూడా నడిగర్ కి మద్దతుగా నిలిచింది. ధనుష్ విషయంలోనూ తమిళ నిర్మాతల మండలి ఇలాంటి చర్యకు దిగిన సంగతి తెలిసిందే.