చీరలో పటానీ సొగసు రొటీనే అనేశారు
మనీష్ మల్హోత్రా హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో బాలీవుడ్ కథానాయికల తళుకుబెళుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
By: Tupaki Desk | 6 Nov 2023 6:33 AM GMTమనీష్ మల్హోత్రా హోస్ట్ చేసిన దీపావళి పార్టీలో బాలీవుడ్ కథానాయికల తళుకుబెళుకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంట్లో ఎప్పటిలానే తనవైన హాట్ లుక్స్ తో దిశా పటానీ వేడి పెంచేసింది. అయితే ఈ లుక్ తో కొందరు సంతృప్తిగా లేరు. చాలా మంది దిశా సొగసు చూడతరమా? అంటూ లవ్ హార్ట్ ఈమోజీలను షేర్ చేసినా కానీ.. ఒక సెక్షన్ అభిమానులు మాత్రం సంతృప్తి చెందలేదు. ప్రతిసారీ దిశా చీరలో ఇదే సీన్ ని రిపీట్ చేస్తోందంటూ విమర్శించారు.
దిశా చాక్లెట్ బ్రౌన్ చీర ధరించి స్టార్ స్టడెడ్ పార్టీలో షో స్టాపర్ గా నిలిచింది. టైట్ ఫిట్ జాకెట్టు -హీల్స్‌తో నడుమ దిగువకు కట్టుకున్న చీరలో ఎంతో హాట్ గా కనిపించింది. కొద్దిపాటి మేకప్ ఓపెన్ హెయిర్‌తో దిశా ఎప్పటిలానే అందంగా కనిపించినా కానీ, ఎందుకనో ఈసారి కొందరు నెటిజనులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. దిశా రూపానికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారగా, చాలామంది ఆమె లుక్ పై వ్యతిరేకంగా స్పందించారు. ప్రతిసారీ ఇదే లుక్ ని పునరావృతం చేస్తోందని కామెంట్ చేసారు. ``అన్ని సమయాల్లో ఒకే రకమైన బట్టలు ధరిస్తోంది. బ్రా లేదా బ్లౌజ్ లేదా స్పోర్ట్స్ బ్రా - ఈసారి చీరతో కప్పుకుంది. ఇతర సమయాల్లో వర్కౌట్ టైట్స్ లేదా కార్గో ప్యాంటు - అదే ఈమె స్టైల్`` అని సోషల్ మీడియాలో ఒక నెటిజన్ విమర్శించారు. ``అదే లుక్.. ఏమీ మారదు.. అదే చీర స్టైల్`` అని మరొకరు కామెంట్ చేసారు. `హర్ బార్ సేమ్ లుక్ హోతా హై`` అని మరొక నెటిజన్ రాశారు. ``ఇది ఎల్లప్పుడూ పనికిమాలినదిగా కనిపిస్తుంది`` అని మరొక నెటిన్ వ్యాఖ్యానించారు.
పార్టీలోకి ప్రవేశించే సమయంలో దిశాను పలువురు కోస్టార్లు పలకరించడం కలిసి పోజులివ్వడం కూడా కనిపించింది. ఇదే స్టార్ నైట్ ఈవెంట్లో సీనియర్ హీరోయిన్ రేఖ ఎరుపు అంచుతో ఉన్న బంగారు నలుపు చీరలో తళుక్కుమన్నారు. తన చీరపై డిజైన్‌కు సరిపోయేలా ఎరుపు రంగులతో బంగారు ఆభరణాలతో పరిపూర్ణంగా కనిపించారు. పార్టీకి వెళ్లే ముందు దిశా-రేఖ జోడీ ఇద్దరూ కెమెరా కోసం ముసిముసి నవ్వులు నవ్వారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే... దిశా మరోసారి తన మాజీ టైగర్ ష్రాఫ్‌తో జతకట్టబోతున్నట్లు సమాచారం. దర్శకనిర్మాత జగన్ శక్తి తదుపరి చిత్రం `హీరో నంబర్ 1`లో వీరిద్దరూ నటిస్తున్నారు. మొదట్లో సారా అలీ ఖాన్‌ను ఈ పాత్రకు ఎంపిక చేశారు. కానీ సారా స్థానంలో దిశా వచ్చి చేరింది. ఈ మార్పుపై దర్శకుడు జగన్ శక్తి స్పందిస్తూ “దిషా చాలా ఫిట్ ..యాక్షన్ చేయడానికి తగిన నటి. సారా కచ్చితంగా ఈ సినిమాలో భాగమే, కానీ దురదృష్టవశాత్తు కాల్షీట్లతో అడ్జస్ట్ కాలేకపోయాం`` అని తెలిపారు.
హీరో నంబర్ 1లో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ కజిన్ పష్మీనా రోషన్ టైగర్ ప్రేమికురాలిగా నటించనుంది. ఈ ప్రాజెక్ట్ డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన హీరోనం.1 కి సీక్వెల్ కాదని తెలిసింది. 1997లో గోవింద-నటించిన చిత్రానికి రీమేక్ లేదా సీక్వెల్ కాదు. ఈ చిత్రాన్ని జాకీ భగ్నాని ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తోంది.