Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : పలుచటి చీరలో అందాలు చూపుతూ శోభితా

బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేయడంలో ఈమె ముందు ఉంటుంది.

By:  Tupaki Desk   |   8 Nov 2023 4:34 AM GMT
పిక్ టాక్ : పలుచటి చీరలో అందాలు చూపుతూ శోభితా
X

తెలుగు అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో రాణించలేరు.. ఒక వేళ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా సెకండ్‌ హీరోయిన్ గా లేదా చిన్న సినిమాల్లో మాత్రమే నటించాల్సి ఉంటుంది అనుకుంటున్న సమయంలో శోభితా దూళిపాళ్ల టాలీవుడ్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా దుమ్ము రేపుతోంది. అక్కడ ఇక్కడ ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటూ దూసుకు పోతుంది.


బాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేయడంలో ఈమె ముందు ఉంటుంది. 2013 లో మిస్ ఇండియా అందాల పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన శోభితా ధూళిపాళ్ల 2013 లో మిస్ ఎర్త్‌ ఇండియా అందాల పోటీల్లో భారతదేశం తరపున పాల్గొన్న విషయం తెల్సిందే. అందాల ఆరబోత లో ఎప్పుడూ కూడా ముందు ఉండే ఈ అమ్మడు మరోసారి తన సత్తా చాటింది.


సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసిన అందాల ఫోటో షూట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. చీర కట్టు లో నడుము నాభి అందాలను చూపిస్తూ గతంలో ఎన్నో ఫోటో షూట్స్ ను షేర్ చేసింది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా పలుచటి చీర లో తన మొత్తం అందాలను చూపిస్తూ కన్నుల విందు చేస్తోంది.

అందాల ఆరబోత ఫోటోలతో ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్న శోభితా దూళిపాళ్ల ముందు ముందు టాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వడం ఖాయంగా ఆమె అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు, సిరీస్ లు చేస్తూ బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇలాంటి ఫోటో షూట్స్ తో ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.