పిక్ టాక్ : చూస్తే మతిపోవడం ఖాయం
సహాయ దర్శకురాలిగా హిందీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శర్వరి దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత నటిగా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది.
By: Tupaki Desk | 28 Nov 2023 5:30 PMసహాయ దర్శకురాలిగా హిందీ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన శర్వరి దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత నటిగా హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది. టెక్నీషియన్ గా మంచి పేరు దక్కించుకోవాలి అనుకున్న శర్వరి వాగ్ యొక్క అందం సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని సొంతం చేసుకోవడం తో నటిగా అడుగులు వేసిందని అంటూ ఉంటారు.
2021లో బంటీ ఔర్ బబ్లీ 2 సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ అమ్మడికి అందం విషయంలో మంచి మార్కులు పడ్డాయి. అంతే కాకుండా వెబ్ సిరీస్ ద్వారా కూడా మెప్పించి మంచి భవిష్యత్తు ఉంది అని నిరూపించుకుంది. ప్రస్తుతం వచ్చిన ప్రతి ఆఫర్ ని ఒప్పేసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటో లు వైరల్ అవుతున్నాయి. తాజాగా మరోసారి సన్నని నడుము అందంతో క్లీ వేజ్ షో చేస్తూ ఫోటోలకు ఇచ్చిన ఫోజ్ లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. శర్వరి షేర్ చేసిన ఈ ఫోటోలు సౌత్ లో కూడా నెటిజన్స్ తో లైక్ కొట్టించుకుంటున్నాయి అనడంలో సందేహం లేదు.
స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా ఉన్న శర్వరి ఇంకాస్త ముందుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, మరి కొందరు ముందు ముందు బాలీవుడ్ లో ఈ అందగత్తె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తోంది అంటున్నారు