Begin typing your search above and press return to search.

ఎంగేజ్‌మెంట్ ఫోటోతో షాకిచ్చిన మ‌హేష్ చెల్లెలు

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో వెంక‌టేష్, మ‌హేష్ కు చెల్లిగా న‌టించిన అభిన‌య అంద‌రికీ సుప‌రిచితురాలే.

By:  Tupaki Desk   |   10 March 2025 1:27 PM IST
ఎంగేజ్‌మెంట్ ఫోటోతో షాకిచ్చిన మ‌హేష్ చెల్లెలు
X

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు సినిమాలో వెంక‌టేష్, మ‌హేష్ కు చెల్లిగా న‌టించిన అభిన‌య అంద‌రికీ సుప‌రిచితురాలే. రీసెంట్ గా ఈ సినిమా రీరిలీజై మంచి రెస్పాన్స్ అందుకోగా, ఇదే టైమ్ లో అభిన‌య అంద‌రికీ ఓ గుడ్ న్యూస్ ను షేర్ చేసింది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎన్నో సినిమాలు చేసి త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న అభిన‌య తన ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేసి అందికీ షాకిచ్చింది.

కాబోయే భ‌ర్త‌తో క‌లిసి గుడిలో దేవుని ముందు గంట కొడుతున్న ఫోటోను షేర్ చేసి నేటి నుంచి మా ప్ర‌యాణం మొద‌లైంద‌ని ఇద్ద‌రి చేతులు, రింగులు చూపిస్తూ త‌మ ఎంగేజ్‌మెంట్ అయింద‌నే విష‌యాన్ని ప్ర‌క‌టించింది. కానీ త‌న కాబోయే భ‌ర్త ఎవ‌ర‌నేది మాత్రం అభిన‌య వెల్ల‌డించ‌లేదు. ప్ర‌స్తుతం ఈ ఫోటోకు అంద‌రూ లైకుల వ‌ర్షం కురిపిస్తూ ఆ జంట‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

అయితే నెల కింద‌ట ఓ త‌మిళ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అభినయ త‌న రిలేష‌న్‌షిప్‌ను బ‌య‌ట‌పెట్టింది. చిన్న‌నాటి స్నేహితుడితో తాను 15 ఏళ్లుగా రిలేష‌న్‌లో ఉన్న‌ట్టు తెలిపిన అభిన‌య, అత‌న్నే పెళ్లి చేసుకుంటాన‌ని కూడా వెల్ల‌డించింది. అయితే త‌న ప్రియుడు ఎవ‌రు? ఏం చేస్తార‌నేది మాత్రం ఎంగేజ్‌మెంట్ అయినా అభిన‌య వెల్ల‌డించ‌లేదు.

ఇదిలా ఉంటే కొన్నాళ్ల కింద‌ట హీరో విశాల్ తో అభిన‌య రిలేష‌న్ లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లొచ్చాయి. ఈ విష‌యం గురించి ఆమెను అడ‌గ్గా, అవ‌న్నీ రూమ‌ర్లేన‌ని న‌వ్వుతూ త‌న రిలేష‌న్‌షిప్ ను బ‌య‌ట‌పెట్టింది. విశాల్ అంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌ని చెప్పిన అభిన‌య‌, త‌మ మ‌ధ్య ఎలాంటి బంధం లేద‌ని తెలిపింది. కాగా అభిన‌య, విశాల్ క‌లిసి పూజ, మార్క్ ఆంటోని సినిమాలు చేశారు.

ప‌లు సినిమాల‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అభిన‌య చెవుడు మ‌రియు మూగ. అయిన‌ప్ప‌టికీ న‌టిగా త‌న పెర్పార్మెన్స్ తో ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకుంటూ ఇండ‌స్ట్రీలో రాణించ‌డమంటే మాట‌లు కాదు. తెలుగులో కింగ్, శంభో శివ శంభో, సీత‌మ్మ వాకిట్లో, ద‌మ్ము, ఢ‌మ‌రుకం, ధృవ‌, గామి, ఫ్యామిలీ స్టార్ సినిమాల్లో న‌టించిన అంద‌రినీ ఎంత‌గానో మెప్పించింది.