బ్యాక్‌లెస్ బ్లాక్ టాప్‌లో ఆలయ కిల్లింగ్
పాపులర్ కథానాయిక పూజా భేడీ వారసురాలు ఆలయ ఫర్నిచర్ వాలా ఇప్పటికే బాలీవుడ్ కి పరిచయమైంది.
By: Tupaki Desk | 30 Aug 2024 3:15 AM GMTపాపులర్ కథానాయిక పూజా భేడీ వారసురాలు ఆలయ ఫర్నిచర్ వాలా ఇప్పటికే బాలీవుడ్ కి పరిచయమైంది. జవానీ జానెమాన్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఆలయ తొలి ప్రయత్నమే ఎఫ్ విమర్శకుల ప్రశంసలను పొందమేగాక ప్రేక్షకాభిమానుల మనుసుల్ని గెలుచుకుంది. అటుపై ఆలయ తన మొట్టమొదటి మ్యూజిక్ వీడియోతో అభిమానులను ఆకట్టుకుంది. `ఆజ్ సజేయ` సాంగ్‌లో ఆలయ అద్భుతంగా కనిపించింది.
ఆలయా ఎఫ్ తన కెరీర్ ప్రారంభంలోనే పెద్ద దర్శకుడితో కలిసి పనిచేసింది. జవానీ జానేమాన్ తో ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా ఫిలింఫేర్ అవార్డును అందుకుంది. తొలి చిత్రంలోనే ఈ కుర్రబ్యూటీ ఎంతో పరిణతితో నటించి ఆకట్టుకుందన్న ప్రశంసలు దక్కాయి. తర్వాత ఫ్రెడ్డీ చిత్రంతోను ఆలయకు మంచి పేరొచ్చింది. ఆల్మోస్ట్ ప్యార్ విత్ డిజే మొహబ్బత్ లో నటించింది. అయితే కెరీర్ లో భారీ యాక్షన్ చిత్రం బడే మియాన్ చోటే మియాన్ డిజాస్టర్ రిజల్ట్ ని అందుకోవడం తనను తీవ్రంగా నిరాశపరిచింది.
కారణం ఏదైనా ఇటీవల ఆలయ కెరీర్ ఆశించినంత స్పీడ్ ని అందుకోలేదు. అయినా ఆలయ ట్యాలెంటెడ్ గాళ్. తను పెద్ద హీరోయిన్ గా ఎదిగేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇంతలోనే ఆలయ ఎఫ్ షేర్ చేసిన తాజా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. అలయ ఎఫ్ బ్యాక్‌లెస్ బ్లాక్ అండ్ వైట్ గౌనులో అందంగా కనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో అలయ ఎఫ్ ఇలా చెప్పింది, ``నా పోరాటం విశేషమైనది. బంధుప్రీతి కూడా దాని స్థాయిలు లేయర్స్‌ని కలిగి ఉంది. నా బంధుప్రీతి నన్ను గదుల్లోకి నెట్టింది. దర్శకులు నిర్మాతలు నన్ను కలుస్తారు, కానీ నా మొదటి చిత్రం `జవానీ జానేమన్`ను ఒకటిన్నర సంవత్సరాలుగా నన్ను పరీక్షించిన తర్వాత కానీ నాకు ఆ ఒక్క అవకాశాన్ని అందించలేదు`` అని తెలిపింది.
బాలీవుడ్ నటి ఆలయ ఫర్నిచర్ వాలా ఎఫ్ చాలా కాలం ఫోటోగ్రాఫర్ ఫ్రెండ్లీ అన్న టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఒక అవార్డ్ షో కోసం ఆలయ అందమైన గౌను ధరించింది. మంత్రముగ్ధులను చేస్తూ ఉన్న ఈ ఫోటోషూట్ అలయ అభిమానులను, ఫోటోగ్రాఫర్లను పలకరించింది. తాజా ఫోటోషూట్ తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆలయ క్యాప్షన్ లో తన యాక్సిడెంట్ గురించి ప్రస్థావించింది.
ఆలయ క్యాప్షన్ లో ఇలా రాసింది. ``నిన్ను నువ్వు ప్రేమించుకోవడంలో నాకు స్ఫూర్తి. ఇది 9 లలు పైగా అయింది.యు నేను తీవ్రమైన ప్రమాదం నుండి కోలుకోవడానికి కష్టపడుతున్నాను. దీనిలో నా ఎడమ చేతికి అనేక పగుళ్లు ఉన్నాయి. దాని తర్వాత శస్త్రచికిత్స అనంతర సమస్యలు, స్టెరాయిడ్లు వాడకం వంటివి ఇబ్బంది పెడుతున్నాయి. కానీ నేను మీ పోస్ట్‌లను చూసిన ప్రతిసారీ నేను కంబ్యాక్ అవ్వడానికి ప్రేరణ పొందుతాను. ఫిట్నెస్ రొటీన్ కోసం, నా శరీరాన్ని అంగీకరించడం, గతంలో కంటే నన్ను నేను ఎక్కువగా ప్రేమించడం చేస్తున్నాను.. అని తెలిపింది.
ఆలయ ఇప్పటివరకు 4 బాలీవుడ్ సినిమాల్లో నటించింది. జవానీ జానేమాన్లో సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే తన నటనకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మిగిలిన మూడు సినిమాలు శ్రీకాంత్, బడే మియా చోటే మియా, ఫ్రెడ్డీలలోను నటిగా ఆకట్టుకుంది. జీ 5లో U-టర్న్‌తో OTT అరంగేట్రం చేసింది. అలయ ఎఫ్ నిజంగా చాలా కష్టపడి పని చేస్తుంది. పలు నటనా పాఠశాలల్లో శిక్షణ తీసుకుంది. మరోవైపు ఆలయ ఫ్యాషనిస్టాగా వెలిగిపోతోంది. అలయ వర్కవుట్ చేయడాన్ని అస్సలు మిస్ కాదు. దానిని రోజువారీ దినచర్యలో భాగంగా చేసుకుంది. మానసికంగా, శారీరకంగా తనను తాను సవాలు చేసుకోవడం ఆలయకు చాలా ఇష్టం. ఆలయ.. నటి పూజా బేడీ - వ్యాపారవేత్త ఫర్హాన్ ఇబ్రహీం ఫర్నిచర్వాలాలకు జన్మించారు.