Begin typing your search above and press return to search.

ఆలియా వింత స‌మ‌స్య‌తో భ‌ర్త‌కు చిక్కులు?

అంద‌మైన క‌థానాయిక‌- ఇస్మార్ట్ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   13 Oct 2024 8:15 AM GMT
ఆలియా వింత స‌మ‌స్య‌తో భ‌ర్త‌కు చిక్కులు?
X

అంద‌మైన క‌థానాయిక‌- ఇస్మార్ట్ హీరో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డేటింగ్ స‌మ‌యంలో పెళ్లిలో కాబోయే భార్య గురించిన ఒక ర‌హ‌స్యం త‌న‌కు ఎంత‌మాత్రం తెలీదు. కానీ పెళ్ల‌య్యాక అస‌లు విష‌యం తెలిసింది. ఆమెకు ఒక వింతైన అనారోగ్య స‌మ‌స్య ఉంది. ఆ స‌మ‌స్య కార‌ణంగా కొన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని ఆ హీరోకి అర్థ‌మైంది. అయినా విధిని మార్చ‌లేడు గ‌నుక‌.. ఆ వింతైన అనారోగ్య‌ స‌మ‌స్య‌ను అర్థం చేసుకుని భార్య‌కు అవ‌స‌ర‌మైన విధంగా స‌హ‌క‌రిస్తున్నాడు. అస‌లు ఈ ఎపిసోడ్ లో వింతైన స‌మ‌స్య ఎదుర్కొంటున్న హీరోయిన్ ఎవ‌రో చెప్పాల్సిన ప‌ని లేదు. ది గ్రేట్ ఆలియాభ‌ట్. భ‌ర్త ర‌ణ‌బీర్ క‌పూర్ త‌న‌ను ఎంతో అర్థం చేసుకుని స‌హ‌క‌రిస్తున్నాడు.

ఈ విష‌యాన్ని తాజాగా క‌రిష్మా క‌పూర్‌తో పాడ్ కాస్ట్ లో ఆలియా భ‌ట్ స్వ‌యంగా తెలిపింది. త‌న‌కు ఓ వింత స‌మ‌స్య ఉంద‌ని, హైప‌ర్ టెన్ష‌న్ తో చాలా ఇబ్బంది పడుతుంటాన‌ని ఆలియా చెప్పింది. ఓసారి త‌మ కుమార్తెతో క‌లిసి ర‌ణ‌బీర్ ఒక ఫోటో దిగుదామ‌ని ఆలియాను కోరాడు. కానీ దానికి ఆలియా చాలా కంగారు ప‌డిపోయింది. తాను అలా కంగారు ప‌డిపోవ‌డానికి ప్ర‌త్యేకించి కార‌ణం ఏదీ లేదు. అయినా కంగారు ప‌డింది. 2023 క్రిస్మ‌స్ స‌మ‌యంలో బ‌య‌ట లంచ్ కోసం వెళ్లిన‌ప్పుడు ఆలియాకు ఈ ప‌రిస్థితి ఎదురైంద‌ట‌. త‌మ కుమార్తెకు రాహా అని పేరు పెట్టాక మీడియాకు ప‌రిచ‌యం చేయాల‌ని భావించారు. కానీ చేయ‌లేదు.. దానికి కూడా ఆలియా చాలా టెన్ష‌న్ కి గురైంద‌ట‌.

ఇది నిజంగా క‌నిపించ‌నంత పెద్ద స‌మ‌స్య‌. అయిన‌దానికి కాని దానికి కంగారు ప‌డే త‌త్వం త‌న‌ది. కానీ ర‌ణ‌బీర్ త‌న‌ను అర్థం చేసుకున్నాడు. త‌న‌కు ఉన్న అనారోగ్యం గురించి ముందే తెలుసు గ‌నుక ఆ స‌మ‌యంలో టాపిక్ మార్చేసి ఏవేవో మాట్లాడాడు అట‌. ఈ విష‌యాల‌న్నీ తాజా పాడ్ కాస్ట్ లో ఆలియా భ‌ట్ వెల్ల‌డించింది.

ఆర్.ఆర్.ఆర్ , రాజీ, గంగూభాయి క‌తియావాడీ లాంటి చిత్రాల్లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో చెర‌గ‌ని ముద్ర వేసిన ఆలియా వ్యక్తిగ‌త జీవితం ఎంత స‌మ‌స్యాత్మ‌క‌మైన‌దో దీనిని బ‌ట్టి మ‌నం ఊహించ‌గ‌లం. అలియా భట్ గ‌త‌ ఇంట‌ర్వ్యూల‌లోను మానసిక రుగ్మతతో బాధపడుతున్నానని, ఎక్కువ స‌మ‌యం దేనిపైనా దృష్టి పెట్టలేనని చెప్పింది. తనకు చాలా కాలం పాటు టాస్క్‌లపై దృష్టి పెట్టడం కష్టంగా మారే పరిస్థితి ఉందని వెల్లడించింది. తనకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ఏడిహెచ్‌డి) ఉందని, అందుకే మేకప్ సెట్‌లో 45 నిమిషాల కంటే ఎక్కువ సమయం వెచ్చించలేనని, దేనిని అయినా సింపుల్ గా ముగించే విధానాన్ని ఇష్టపడ‌తాన‌ని తెలిపింది. ఈ పరిస్థితి కారణంగా ఆలియా తన పనిలో తొందరపాటుతో ఉంటాన‌ని.. నాతో క‌లిసి ప‌ని చేసేవారు కూడా త్వ‌ర‌గా ప‌ని పూర్త‌య్యేట్టు త‌న‌తో ఉండాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని వెల్ల‌డించి షాకిచ్చింది.

ADHD అనేది మానసిక రుగ్మత. ఇది ఉన్న వ్య‌క్తుల‌కు ఓ ప‌ట్టాన దేనిపైనా శ్ర‌ద్ధ ఉండ‌దు. ఒక‌దాని వెంట ఒక‌టిగా ప‌నుల‌ను చ‌క్క‌బెట్ట‌లేరు. శ్రద్ధను రోజంతా ఒకేలా కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కోవాలి.. పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా పనులు చేసే ధోరణి ఉంటుందిట‌. అయితే ఆలియా ఆరోగ్య ప‌రిస్థితి ఇలా ఉన్నా కానీ, బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టించేస్తోంది. ఇటీవ‌ల జిగ్రా విడుద‌లైంది. దీనికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చాయి. దీంతో పాటు వై.ఆర్.ఎఫ్‌లో స్పై థ్రిల్లర్ ఆల్ఫా చిత్రీక‌ర‌ణ‌లో ఉంది. త‌దుప‌రి భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో `లవ్ అండ్ వార్`లో న‌టిస్తుంది. ఆ తర్వాత ఒక నిజ‌మైన‌ రొమాంటిక్ ల‌వ్ స్టోరీని నిర్మించడానికి, అలాగే నటించడానికి అలియా భట్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ర‌ణ‌బీర్ స‌ర‌స‌న ఆలియా న‌టించేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు.