వసూళ్లలో సగం ఆ నటి పారితోషికంగానే!
అలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన `జిగ్రా` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Oct 2024 2:30 PM GMTఅలియా భట్, వేదాంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన `జిగ్రా` ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా తొలి షోతోనే తేలిపోయింది. మొదటి రోజు ఈ సినిమా 4.55 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లు అంతకంతకు డౌన్ అయ్యాయి. పుల్ రన్ లో సినిమా 30 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
మరి ఈ సినిమాకి అలియాభట్ తీసుకున్న పారితోషికం ఎంత? అంటే 10-15 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా? అంటే సినిమాకి వచ్చిన కలెక్షన్స్ లో సగం అలియాభట్ పారితోషికంగానే పోతుంది. తొలి రోజు వసూళ్లతో పొలిస్తే అలియా అందుకున్న పారితోషికం మూడు రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ సన్నివేశం అలియాభట్ మార్కెట్ రేంజ్ ని హైలైట్ చేస్తుంది. మహష్ భట్ వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అలియాభట్ ఇండస్ట్రీలో ఎదుగుతోన్న వైనం ఎంతో మందికి స్పూర్తి.
`స్టూండెట్ డెంట్ ఆఫ్ ది ఇయర్` తో లాంచ్ అయిన అలియా భట్ అటుపై ఎన్నో సక్సెస్ లు చూసింది. `గంగూబాయి కతియా వాడి`తో అమ్మడి రేంజ్ పీక్స్ కి చేరింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అలియాభట్ తొలి సోలో సక్సెస్ ఇది. ఈ సినిమాతో అలియాభ్ట స్టార్ డమ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఈ సక్సెస్ తర్వాతో సోలో అవకాశాలు క్యూ కడుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే `జిగ్రా`లో కీలక పాత్రకు వాసన్ బాలా ఆమెని ఎంపిక చేసారు. కానీ ఆమె పాత్ర వరకూ ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రేక్షకులకు నచ్చకపోవడంతో సక్సెస్ అవ్వలేదు. ప్రస్తుతం అలియాభట్ `ఆల్పా`లో నటిస్తోంది. ఈ సినిమాపై నా భారీ అంచనాలున్నాయి. అటు `యానిమల్` సక్సెస్ తర్వాత భర్త రణబీర్ కపూర్ రేంజ్ మారిపోయింది. అతడి పారితోషికం అంతకంతకు పెరిగిపోయింది.