Begin typing your search above and press return to search.

మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. ఈ అందానికి ఒక్క హిట్టు పడితే..

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.

By:  Tupaki Desk   |   5 Sep 2024 10:30 PM GMT
మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. ఈ అందానికి ఒక్క హిట్టు పడితే..
X

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. ఈ బ్యూటీ మొదటి సినిమాలోనే అదిరిపోయే గ్లామర్ షోతో అందరి దృష్టిని తనవైపు తిప్పేసుకుంది. సాంగ్స్ లో తన అందంతో ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవిని గుర్తుచేసింది. మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్ కి ముందు టాలీవుడ్ లో భాగ్యశ్రీ బోర్సే మోస్ట్ ట్రెండింగ్ హీరోయిన్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారెంటీ అని అందరూ మాట్లాడారు.

ఆమె గ్లామరస్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. మిస్టర్ బచ్చన్ మూవీ ఫ్లాప్ అయిన కూడా సాంగ్స్ జనాలకి బాగా రీచ్ అయ్యాయి. దీంతో భాగ్యశ్రీ బోర్సేకి అవకాశాలు బాగానే వస్తున్నాయనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రకి చెందిన ఈ ముద్దుగుమ్మ హిందీలో యారియాన్ 2 చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. తరువాత చందూ ఛాంపియన్ మూవీలో కూడా ఓ పాత్రలో కనిపించింది. అయితే మొదటి రెండు సినిమాలలో ఆమె హీరోయిన్ గా చేయలేదు.

హరీష్ శంకర్ మాత్రం భాగ్యశ్రీ బోర్సేలో హీరోయిన్ ఫీచర్స్ ని చూసి మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ కి పరిచయం చేశాడు. ఈ మూవీ ఫెయిల్యూర్ అయ్యింది. అయిన కూడా భాగ్యశ్రీ తెలుగులో రెండో సినిమాని ఏకంగా విజయ్ దేవరకొండకి జోడీగా చేసే అవకాశం అందుకుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తోన్న VD12 సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ స్టేజ్ లో ఉంది.

ఇదిలా ఉంటే భాగ్యశ్రీ బోర్సే ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన గ్లామర్ పిక్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతూ ఉంటాయి. వైట్ కలర్ షర్టు, జీన్ షార్ట్ లో భాగ్యశ్రీ బోర్సే తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. షర్టు బటన్స్ వదిలేసి కేవలం బ్లౌజ్ తో ఉన్న గ్లామర్ పిక్స్ లో భాగ్యశ్రీ చాలా అందంగా ఉందనే మాట వినిపిస్తోంది.

ఇలాంటి గ్లామర్ కి సరైన హిట్ పడితే నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చైర్ లో భాగ్యశ్రీ బోర్సే ఎక్కి కూర్చోవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. విజయ్ దేవరకొండతో చేస్తోన్న మూవీ షూటింగ్ జరుగుతూ ఉండగానే మరికొన్ని సినిమాల కోసం భాగ్యశ్రీని సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.