Begin typing your search above and press return to search.

పొట్టి డ్రెస్సులో బచ్చన్ బ్యూటీ.. కిర్రాక్ లుక్

ఈ సినిమాలోని సాంగ్స్ లో హరీష్ శంకర్ భాగ్యశ్రీని చాలా గ్లామరస్ గా చూపించారు. దీంతో యూత్ ని భాగ్యశ్రీ ఇట్టే ఎట్రాక్ట్ చేసింది.

By:  Tupaki Desk   |   27 Oct 2024 4:49 AM GMT
పొట్టి డ్రెస్సులో బచ్చన్ బ్యూటీ.. కిర్రాక్ లుక్
X

మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే. హిందీలో ‘యారియాన్ 2’ మూవీతో నటిగా ఈ బ్యూటీ తెరంగేట్రం చేసింది. తరువాత హిందీలోనే ‘చందూ చాంపియన్’ సినిమాలో నటించింది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలోని సాంగ్స్ లో హరీష్ శంకర్ భాగ్యశ్రీని చాలా గ్లామరస్ గా చూపించారు. దీంతో యూత్ ని భాగ్యశ్రీ ఇట్టే ఎట్రాక్ట్ చేసింది.

అయితే ‘మిస్టర్ బచ్చన్’ మూవీ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ బోర్సేకి కమర్షియల్ హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. అయిన కూడా ఆ మూవీ రిలీజ్ కాకుండానే విజయ్ దేవరకొండకి జోడీగా ‘VD12’ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ ఛాన్స్ అందుకుంది. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో భాగ్యశ్రీ సూపర్ సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉంది. దీంతో పాటు రీసెంట్ గా దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో ప్రారంభమైన సినిమాలో హీరోయిన్ గా కూడా భాగ్యశ్రీ ఖరారైంది.

సరైన బ్రేక్ రాకుండానే భాగ్యశ్రీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. టాలీవుడ్ లో నెక్స్ట్ స్టార్ హీరోయిన్ ఈమెనే అనేంతగా అందరిని ఆకర్షిస్తోంది. సరైన హిట్స్ రెండు పడితే ఇక భాగ్యశ్రీ స్పీడ్ ని ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు సైతం అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ లో అంత యాక్టివ్ గా లేదు. అయితే అప్పుడప్పుడు తన అప్డేట్స్ షేర్ చేసుకుంటూ ఉంటుంది. గ్లామర్ ఫోటోలని కూడా పోస్ట్ చేస్తూ అందరిని ఆకర్షిస్తుంది.

తాజాగా భాగ్యశ్రీ బోర్సే ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ కలర్ స్కర్టుతో ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో టోపీ పెట్టుకొని అదిరిపోయే స్మైల్ తో నెటిజన్లు చూపులు తిప్పుకోకుండా చేసేస్తుంది. భాగ్యశ్రీ ఈ లుక్స్ లో అందాల కలల దేవతలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడగానే రిఫ్రెష్ ఫీల్ ఇచ్చే అందం భాగ్యశ్రీ సొంతం అని ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.