Begin typing your search above and press return to search.

షాకింగ్ : సీనియ‌ర్ TV న‌టిపై వేధింపులు!

ఇప్పుడు ముంబై శివారులో జ‌రిగిన హోలీ పార్టీలో ప్ర‌ముఖ టీవీ న‌టి వేధింపుల‌కు గుర‌య్యాన‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

By:  Tupaki Desk   |   17 March 2025 9:27 AM IST
షాకింగ్ : సీనియ‌ర్ TV న‌టిపై వేధింపులు!
X

షూటింగులు జ‌రిగే చోట న‌టీమ‌ణుల‌పై వేధింపుల‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌లు చాలా బ‌య‌ట‌ప‌డుతూనే ఉన్నాయి. ఔట్ డోర్ షూటింగుల్లో న‌టీమ‌ణుల భ‌ద్ర‌త‌కు సంబంధించిన చిక్కు ప్ర‌శ్న ఎప్పుడూ అలానే ఉంది. ఇప్పుడు ముంబై శివారులో జ‌రిగిన హోలీ పార్టీలో ప్ర‌ముఖ టీవీ న‌టి వేధింపుల‌కు గుర‌య్యాన‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇండ‌స్ట్రీలో మూడు ద‌శాబ్ధాలుగా కొన‌సాగుతున్న స‌ద‌రు న‌టీమ‌ణిని స‌హ‌చ‌ర న‌టుడు లైంగికంగా వేధింపుల‌కు గురి చేసాడు.

ఆమె అనామ‌కంగా త‌న పేరును బ‌య‌ట‌పెట్ట‌కుండా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం అల‌జ‌డి సృష్టించింది. అతను నాపై .. పార్టీలో ఉన్న ఇతర మహిళలపైనా రంగులు పూయడానికి ప్రయత్నించాడు. నేను నా ముఖాన్ని కప్పుకుంటే, నన్ను బలవంతంగా పట్టుకుని, నా బుగ్గలపై రంగులు పూసాడు. ఆపై నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా నుండి నిన్ను ఎవరు రక్షిస్తారో చూస్తాను! అని హెచ్చ‌రించాడ‌ని ఫిర్యాదు చేసింది.

నిజానికి స్త్రీల‌పై ఇలాంటి దౌర్జ‌న్యాలకు అడ్డూ ఆపూ లేదు. పురుషాహంకారం అత‌డి మాట‌ల్లో ప్ర‌తిధ్వ‌నించింది. సాటి న‌టీమ‌ణి సురక్షితంగా ఉండాల‌ని కోరుకోవాల్సిన స‌హ‌న‌టుడే ఇలా వేధింపుల‌కు గురి చేసి అభ‌ద్ర‌త‌కు కార‌కుడ‌య్యాడు. ఎంతో ప‌విత్ర‌మైన రంగుల పండుగ‌ను అత‌డు త‌న కామ కేళి కోసం ఉప‌యోగించుకోవ‌డానికి బ‌రి తెగించాడు. పైగా న‌టీమ‌ణిపై అధికారం చెలాయించాల‌ని, బెదిరింపుల‌తో అణ‌చివేయాల‌ని చూసాడు. కానీ ఆమె ధైర్యంగా దానిని ఎదుర్కొని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

నిజానికి మాలీవుడ్ లో హేమ క‌మిటీ నివేదిక సృష్టించిన ప్ర‌కంప‌న‌లు అన్నీ ఇన్నీ కావు. ప‌ని ప్ర‌దేశంలో మ‌హిళా న‌టీమ‌ణులకు భ‌ద్ర‌త క‌ల్పిస్తూ.. అద‌న‌పు సౌక‌ర్యాల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు చేయాల‌ని నిర్మాత‌లను కోర్టు ఆదేశించింది. కానీ అహంకారుల మ‌ధ్య ఇలాంటి అవకాశం ఉందా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.