లడ్డూ అనే పిలుపుకి దూరమైన హీరోయిన్!
పిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులకు మాత్రం ఎప్పటికీ చిన్న పిల్లలే. అందుకే ఎంత వయసొచ్చినా ముద్దు పేర్లతోనే సంబోధిస్తుంటారు.
By: Tupaki Desk | 15 July 2023 6:21 AM GMTపిల్లలు ఎంత పెద్దవారైనా తల్లిదండ్రులకు మాత్రం ఎప్పటికీ చిన్న పిల్లలే. అందుకే ఎంత వయసొచ్చినా ముద్దు పేర్లతోనే సంబోధిస్తుంటారు. లడ్డూ..కన్న..బుజ్జీ..నాన్న అంటూ తల్లిదండ్రులు మారం చేస్తుంటారు. అందులోనూ హైఫై ఫ్యామిలీలోనూ...సెలబ్రిటీ కుటుంబాల్లో ఉండే గారాబాలు నెక్స్ట్ లెవల్లో ఉంటాయి. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ ని మామ్ శ్రీదేవి ఎలా గారాబం చేసేవారో? తెలిపింది. చిన్న వయసు నుంచి పెద్దయిన సరే జాన్వీని మామ్ ఎప్పుడూ లడ్డూ అనే పిలిచేవారుట.
`ఊహ తెలిసిన దగ్గర నుంచి చనిపోయే వరకూ అదే పిలుపుతో అమ్మ ప్రేమను పోందేదాన్ని. కానీ ఇప్పుడా పిలుపు దూరమైంది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే చాలా బాధగా ఉంటుంది. ఏదో కోల్పోయామే మనోవేదనకి గురవుతుంటా. అన్ని ఉన్నా అమ్మ లేని లోటు కనిపిస్తూనే ఉంటుంది. తల్లి ప్రేమకి అవదుల్లేవ్. అమ్మతో గడిపిన ప్రతీ క్షణం ఎంతో గొప్ప విలువైనది. అమ్మ చనిపోయాక చాలా సమయం సెట్లోనే ఉండిపోయా.
తను దూరమైన క్షణం నుంచి ఇప్పటివరకూ నాకు అంతా శూన్యంలా అనిపిస్తుంది. అమ్మను కోల్పోవడం ఓ యుద్దంలా అనిపిస్తుంది. అమ్మ చనిపోయన సమయంలో ధడక్ షూటింగ్ లో ఉన్నా. ఆ తర్వాత కొన్ని రోజులకు సెట్స్ కి వెళ్లినా షూటింగ్ లో సరిగ్గా పాల్గొనే దాన్ని కాదు. మనసు పెట్టి పని చేయలేకపోయే దాన్ని` అని తెలిపింది.
ఇక జాన్వీ కెరీర్ సంగతి చూస్తూ `దేవర` సినిమాతో టాలీవుడ్ లో లాంచ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. జాన్వీ ఎంట్రీ కోసం టాలీవుడ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తోంది. శ్రీదేవి లేకపోయినా ఆమా జ్ఞాపకార్దం జాన్వీని తెరపైన చూసుకోవాలని తెలుగు అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఆ కోరిక వచ్చే ఏడాది నెరవేరబోతుంది. అలాగే బాలీవుడ్ లోనూ మరో రెండు సినిమాలు చేస్తోంది.