Begin typing your search above and press return to search.

కేతిక పాప.. అలా ముద్దుగా..

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది.

By:  Tupaki Desk   |   29 Aug 2024 10:30 PM GMT
కేతిక పాప.. అలా ముద్దుగా..
X

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ, మోడలింగ్ ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించింది. ఆకాష్ పూరి సరసన ‘రొమాంటిక్’ సినిమాతో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కేతిక, మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు సంపాదించింది. సినిమాలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ముఖ్యంగా గ్లామర్ రోల్స్‌లో తన సొగసులతో ఆకర్షణీయంగా కనిపించింది. ఆ సినిమా అనంతరం కేతికకు కొత్త అవకాశాలు వచ్చాయి. నాగ శౌర్యతో 'లక్ష్య' సినిమాతో పాటు వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా'లో నటించింది. అయితే, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కేతికకు పెద్దగా గుర్తింపు రాలేదు.

అయినప్పటికీ, తన అందం, యాక్టింగ్ ప్రతిభతో కుర్రతరం మనసులు గెలుచుకుంటూనే ఉంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, సాయి తేజ్ నటించిన ‘బ్రో’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రం కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించినప్పటికీ, కేతికకు ఆశించినంత గుర్తింపు మాత్రం రాలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.

ప్రస్తుతం కేతిక తనకు సరైన అవకాశాలు రావాలని ఎదురు చూస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, కొత్త ఫోటోషూట్లను పంచుకుంటూ, ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. త్రోబ్యాక్ ఫోటోలు, స్టైలిష్ లుక్స్ తో ఆమె ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా అమ్మడు మరోసారి స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. పెదవులు రౌండ్ గా చేసి తన కురులను అలా వదిలేసింది. ఫ్రేమ్ లో అమ్మడు ఎంతో చూడముచ్చటగా ఉందని ఫాలోవర్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

టాలీవుడ్‌లో మంచి బ్రేక్ కోసం కేతిక ఎదురుచూస్తున్న ఈ సమయంలో, తన టాలెంట్‌ను చూపించేందుకు అమ్మడు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య ఒక కోలీవుడ్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు చెప్పింది. అలాగే వెబ్ సీరీస్ లు కూడా చేయనున్నట్లు కేతిక వివరణ ఇచ్చింది. కానీ వాటిపై అఫీషియల్ గా ఎలాంటి అప్డేట్స్ లేవు. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ ఎలాంటి పాత్రల్లో కనిపిస్తుందో చూడాలి.