మాస్ ట్యాగ్ హీరోలకే కాదు..హీరోయిన్లకు సొంతమే!
వాళ్లలో ముందుగా మాస్ ట్యాగ్ అందుకోవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న భామలు వీళ్లే.
By: Tupaki Desk | 20 Nov 2024 2:30 AM GMTమాస్ ట్యాగ్ హీరోలకే కాదు..హీరోయిన్లకు ఇచ్చేయాల్సిన సమయం ఆసన్నమైంది. హీరోలు మాత్రమే కాదు సరైన స్టోరీ పడితే హీరోయిన్లు సైతం వందల కోట్లు వసూళ్లు తేగల సత్తా ఉన్నవారున్నారు. కాస్తో కూస్తో మేల్ డామినేషన్ కారణంగానూ వాళ్ల ట్యాలెంట్ కిల్ అవుతుంది? అన్న ఆరోపణలో కొంత నిజం లేకపోలేదు. మహిళా నటీమణుల శక్తిని గుర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. వాళ్లలో ముందుగా మాస్ ట్యాగ్ అందుకోవడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న భామలు వీళ్లే.
అనుష్క శర్మ, నయనతార, సాయి పల్లవి, కీర్తి సురేష్, జ్యోతిక లాంటి వాళ్లు ఈ ట్యాగ్ కి అర్హులు. ప్రస్తుతం అనుష్క శర్మ ప్రధాన పాత్రలో క్రిష్ `ఘాటీ` అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఒడిశా-ఆంధ్ర సరిహద్దు అమ్మాయి కథ ఇది. భారతదేశంలోని కొండ లోయలలో నివసించే జీవితాల్ని ఘాటీ ప్రతిబింబిస్తుంది. ఇందులో అనుష్క ఓ బాధితురాలి నుంచి క్రిమినల్‌గా, అనంతరం లెజెండ్‌గా ఎలా మారింది? అన్నది కథ.
ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ చూస్తే అనుష్క ఏ రేంజ్ పెర్పార్మెన్స్ ఇచ్చిందన్నది అంచానా వేయోచ్చు. కొడవలి పట్టి పీక కసాకసా కోసిన తీరు చూస్తే? అనుష్క ఏ స్థాయి నటన కనబరిచిందో చెప్పొచ్చు. అనుష్కలో కొత్త కోణాన్ని ఘాటీ బయటకు తెచ్చిందనొచ్చు. ఇక లేడీ సూపర్ స్టార్ గా నీరాజనాలు అందుకుంటోన్న నయనతార సోలో మార్కెట్ కోసం ఎంతగా ప్రయత్నిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. `రక్కయి` సినిమాలో నయన్ పాత్ర ఇప్పటికే రివీల్ అయింది. కుమార్తె కోసం ఓ తల్లి చేసే పోరాటమే ఈ కథ.
నయన్ నటన, పోరాటం ఎంత భయంకరంగా ఉండబో తుందనేది టీజర్ లోనే చెప్పకనే చెప్పారు. ఇక కీర్తి సురేష్ అలియాస్ మహానటి కి సరైన సోలో కథ పడితే చెలరేగిపోతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం `రివాల్వార్ రీటా`లో నటిస్తోంది. `ఫ్యామిలీ మ్యాన్ -2`, `సీటాడెల్` లో సమంత యాక్షన్ సన్నివేశాల గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాగే బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి `గార్గి` లాంటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ భామకి సరైన యాక్షన్ థ్రిల్లర్ పడితే తిరుగుండదు. మాస్ పాత్రల్లో ఈ భామలంతా పక్కాగా మెప్పింగల నాయికలే.