Begin typing your search above and press return to search.

అందం పేరు మాళ‌విక సందేహాల్లేవ్

అంతేకాదు.. కెరీర్ ప‌రంగాను మాళ‌విక ఇప్పుడు స్పీడ్ మీద ఉంది. ఇటీవ‌లే చియాన్ విక్ర‌మ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తంగ‌ళ‌న్ లో న‌టించింది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 9:02 AM GMT
అందం పేరు మాళ‌విక సందేహాల్లేవ్
X

అందం కేరాఫ్ మాళ‌విక.. మీకేమైనా డౌటా? అందంతో క‌వ్వించడం.. య‌వ్వ‌నంతో మైమ‌రిపింపజేయ‌డం.. గ్లామ‌ర‌స్ యాక్ట్ తో టీజ్ చేయ‌డం.. ఇవ‌న్నీ టాప్ మోడ‌ల్ కం న‌టి మాళ‌విక ప్ర‌త్యేక‌తలు. ఇటీవ‌ల ఇన్ స్టా వేదిక‌గా ఈ బ్యూటీ షేర్ చేస్తున్న వ‌రుస ఫోటోషూట్లు దీనిని ధృవీక‌రిస్తున్నాయి.

అంతేకాదు.. కెరీర్ ప‌రంగాను మాళ‌విక ఇప్పుడు స్పీడ్ మీద ఉంది. ఇటీవ‌లే చియాన్ విక్ర‌మ్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ తంగ‌ళ‌న్ లో న‌టించింది. ఈ సినిమా త‌మిళం, తెలుగులో పెద్ద విజ‌యం సాధించింది. ఇంత‌లోనే ఇప్ప‌డు ప్ర‌భాస్ స‌ర‌స‌న రాజా సాబ్ చిత్రీకర‌ణ‌ను ముగించేస్తోంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.

హిందీ చిత్రం `యుధ్రా`లోను మాళ‌విక క‌థానాయిక‌. ఈ వారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ ఇప్ప‌టికే అంత‌ర్జాలంలోకి వైర‌ల్ గా దూసుకెళ్లింది. ఈ ట్రైల‌ర్ లో మాళ‌విక వేడెక్కించే గ్లామ‌రస్ అవ‌తార్ లో క‌నిపించ‌డ‌మే గాక రొమాన్స్ లోను అద‌ర‌గొట్టింది. యువ‌హీరో సిద్ధాంత్ చతుర్వేదితో లిప్ లాక్ సన్నివేశాలలో మాళ‌విక న‌టించింది. త్వ‌ర‌లోనే ఈ సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుండ‌గా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇక ఇదే స‌మ‌యంలో మాళ‌విక కొత్త ఫోటోలు ఇంట‌ర్నెట్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. వీటిలో మాళ‌విక హాట్ లుక్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ప్ర‌స్తుతం X లో #మాళ‌విక మోహ‌న‌న్ అనే హ్యాష్ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. మాళ‌విక వైట్ హాఫ్ షోల్డ‌ర్ డ్రెస్ లో ఎంతో అందంగా క‌నిపించిన ఫోటోషూట్ ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. మాళ‌విక గుబులు రేపే అందానికి ఫిదా అయిపోయాన‌ని ఒక అభిమాని దీనికి వ్యాఖ్యానించగా, అందం కేరాఫ్ మాళ‌విక.. డౌట్ లేదు అంటూ మ‌రొక అభిమాని ఫిదా అయిపోయాడు. అల్ట్రా స్టైలిష్ మాళ‌విక అంటూ ఒక అభిమాని త‌న చెవి లోలాకుల ప్ర‌త్యేక‌త‌ను కూడా పొగిడేశాడు.