Begin typing your search above and press return to search.

చిలిపిగా మృణాల్ గ్లామర్ మెరుపులు..

టాలీవుడ్ అందాల తార మృణాల్ ఠాకూర్ ఎలాంటి డ్రెస్ వేసినా కూడా ఆ డ్రెస్సుకే అందం వస్తుంది.

By:  Tupaki Desk   |   17 Oct 2024 7:51 AM GMT
చిలిపిగా మృణాల్ గ్లామర్ మెరుపులు..
X

టాలీవుడ్ అందాల తార మృణాల్ ఠాకూర్ ఎలాంటి డ్రెస్ వేసినా కూడా ఆ డ్రెస్సుకే అందం వస్తుంది. ఆ తరహాలో అమ్మడు స్టిల్స్ ఇస్తుంటుంది. ఇక ఇటీవల విడుదల చేసిన ఫోటోషూట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కాఫీ టైమ్ గురించి చెబుతూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఈ ఫొటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. తన శైలి, హావభావాలు, నవ్వు, బాడీ లాంగ్వేజ్‌ తో కట్టిపడేస్తున్న మృణాల్ ఠాకూర్, ఫోటోషూట్‌లో చక్కగా మెరిసిపోతోంది.

ఈ ఫొటోలో మృణాల్ ఠాకూర్ తాను చదివే పుస్తకాన్ని చేతిలో పట్టుకొని, అందమైన జ్యువెలరీని ధరించి కనిపిస్తోంది. గౌరీ అండ్ నైనిక డిజైన్ చేసిన డ్రెస్‌ ఆమె అందాన్ని మరింతగా హైలైట్ చేస్తోంది. అంతేకాకుండా, ఈ ఫోటోషూట్‌లో ఆమె చేతిలో టీ కప్పుతో ఉన్న పోజ్ కూడా కాఫీ బ్రేక్ యొక్క సింప్లిసిటీని ప్రతిబింబిస్తోంది. మేకప్ ఆర్టిస్ట్ మిస్ బ్లెండర్ మరియు హెయిర్ స్టైలిస్ట్ దీపాలీ దీటా ఈ లుక్‌లో ఆమెను మరింత అందంగా తీర్చిదిద్దారు.

ఈ ఫోటోల్లో మృణాల్ ఠాకూర్, క్లాసిక్ లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోటోషూట్ కోసం ఆమె ఇచ్చిన పాజిటివ్ ఎక్స్‌ప్రెషన్ నెటిజన్ల నుంచి ఫుల్ మార్క్స్ తెచ్చుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు 5 లక్షల 18 వేలకుపైగా లైకులు పొందాయి. మృణాల్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది. ఇక తన అభిమానులకు ఎప్పటికప్పుడు కొత్త లుక్స్‌తో ఎలా కనెక్ట్ అవుతుందో ఈ ఫోటోలు నిరూపిస్తున్నాయి.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ టాలీవుడ్, బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులలో బిజీగా ఉంది. గతంలో 'సీతారామం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మృణాల్, ఇప్పుడు మరికొన్ని కంటెంట్ ఉన్న సినిమాలను లైన్ లో పెట్టింది. అలాగే తమిళంతో కూడా ఒక రెండు సినిమాలు చేయబోతోంది. మరి ఆ సినిమాలు అమ్మడికి ఎలాంటి క్రేజ్ తీసుకు వస్తాయో చూడాలి.