ముంతాజ్ షాకింగ్ పరివర్తన!
ముంతాజ్ లో ఇప్పుడు చాలా పరివర్తన కనిపిస్తోంది. హిజాబ్ ధరించి ఆధ్యాత్మిక చింతనలో ఉంది.
By: Tupaki Desk | 22 Jan 2025 8:30 PM GMTపవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ, అత్తారింటికి దారేది లాంటి చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో బోలెడంత పాపులారిటీ తెచ్చుకుంది ముంతాజ్. ఆ తర్వాత వరుసగా పలు చిత్రాల్లో ఐటమ్ క్వీన్ గా వెలిగిపోయింది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రసీమల్లో బోల్డ్ బ్యూటీ ముంతాజ్ కి గొప్ప పాపులారిటీ దక్కింది. కానీ ఈ భామ ఆకస్మికంగా సినీ పరిశ్రమను వదిలి వెళ్లిపోవడం అభిమానులను కలవరపాటుకు గురి చేసింది.
ముంతాజ్ నటించిన చివరి తెలుగు చిత్రం `టామీ` 2015లో విడుదలైంది. ఆ తర్వాత పూర్తిగా తెరకు దూరమైంది. అయితే ముంతాజ్ ఇంతకాలంగా ఏమైంది? అంటూ ఆరా తీస్తున్నవారికి షాకింగ్ విషయం తెలిసింది. ముంతాజ్ లో ఇప్పుడు చాలా పరివర్తన కనిపిస్తోంది. హిజాబ్ ధరించి ఆధ్యాత్మిక చింతనలో ఉంది.
ఇటీవలే సినిమా పరిశ్రమను విడిచిపెట్టాలనే తన నిర్ణయం గురించి ముంతాజ్ బహిరంగంగా వెల్లడించింది. తాను పూర్తిగా ఆధ్యాత్మిక పంథాను అనుసరించానని తెలిపింది. తాను ముస్లిం కుటుంబంలో జన్మించానని , ఖురాన్ లోతైన అర్థాన్ని క్రమంగా గ్రహించానని వెల్లడించింది. దీంతో నటనను విడిచిపెట్టాలనే నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. కొత్త మార్గాన్ని స్వీకరించి.. హిజాబ్ ధరించి ఆధ్యాత్మికతకు తనను తాను అంకితం చేసుకుంది.
ఇప్పటివరకు మూడుసార్లు మక్కాకు వెళ్ళానని కూడా ముంతాజ్ తెలిపారు. అంతేకాదు.. గతంలో తన యాక్టివిటీస్ గురించి విచారం వ్యక్తం చేసింది. గ్లామరస్ పాత్రలతో బోల్డ్ గా కనిపించడంపై రిగ్రెట్ ఫీలవుతోంది. తన పాత డ్యాన్స్ నంబర్‌లను తన కుటుంబంతో చూస్తున్నప్పుడు అసౌకర్యంగా అనిపించిందని ..తాను మరణించిన తర్వాత తన ఫోటోలను సోషల్ మీడియాల్లో షేర్ చేయవద్దని అభ్యర్థించింది. నా బోల్డ్ ఫోటోలను షేర్ చేస్తే అది నన్ను కూడా బాధపెడుతుంది అని వేడుకుంది. చివరిగా తమిళ చిత్రం `రాజాధి రాజా`లో నటించాక ముంతాజ్ పెద్ద తెరపై కనిపించలేదు.