Begin typing your search above and press return to search.

తల్లిని మించిన అందం... నదియా కూతుర్లను చూశారా!

సినిమాల్లో ఆమెను చూస్తే వయసు చిన్నదే కానీ, పెద్ద ఆవిడ పాత్రలను చేస్తుందని అంతా అనుకుంటారు.

By:  Tupaki Desk   |   24 Oct 2024 5:30 PM GMT
తల్లిని మించిన అందం... నదియా కూతుర్లను చూశారా!
X

1980, 90ల్లో మలయాళం, తమిళ్‌ చిత్రాల్లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌గా నటించి కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించిన నదియా తెలుగులోనూ కొన్ని సినిమాల్లో నటించింది. హీరోయిన్‌గా తమిళ్‌లో ఎక్కువ సినిమాలు చేసిన నదియా సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తర్వాత మాత్రం తెలుగు లో ఎక్కువ సినిమాలు చేస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ కి అత్త పాత్రలో నటించడం ద్వారా ఒక్కసారిగా టాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కించుకున్న నదియా ఆ తర్వాత నుంచి వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్ చేస్తూనే వస్తోంది. సినిమాల్లో ఆమెను చూస్తే వయసు చిన్నదే కానీ, పెద్ద ఆవిడ పాత్రలను చేస్తుందని అంతా అనుకుంటారు.

మూడు పదుల వయసులోనే నదియా ఉందని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఆమె వయసు కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు చిన్న పిల్లలు ఏం కాదు. ఆసక్తి ఉంటే హీరోయిన్‌గా పరిచయం అయ్యేంత వయసు అమ్మాయిలు ఉన్నారు. నదియా చాలా అందంగా ఉంటుందని ఆమెను సినిమాల్లో చూసిన వారు, మీడియా సమావేశాల్లో చూసిన వారు అంటూ ఉంటారు. సోషల్‌ మీడియాలో సైతం ఆమె ఫోటోలు రెగ్యులర్‌గా వైరల్‌ అవుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం నదియా కంటే ఆమె ఇద్దరు బిడ్డలు చాలా అందంగా ఉన్నారంటూ నెట్టింట తెగ హడావుడి కనిపిస్తుంది. నదియా ఇద్దరు కూతుర్ల ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

నదియా ఎంతో మంది సీనియర్‌ హీరోలు, హీరోయిన్స్ మాదిరిగా కాకుండా తన ఇద్దరు కూతుర్లను సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతున్నారు. వారికి ఆసక్తి ఉంటే తప్పకుండా సినిమాల్లో నటింపజేసేందుకు తనుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ గతంలో ఒక సందర్భంలో నదియా చెప్పుకొచ్చారు. కానీ ఆమె ఇద్దరు కూతుర్లు సైతం ఉన్నత చదువులు చదువుకుంటూ కెరీర్‌ లో స్థిర పడటం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు నదియ ఇద్దరు కూతుర్ల ఫోటోలను చూసిన వారు వీరు ఎందుకు హీరోయిన్స్‌గా నటించడం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు.

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి కొన్నాళ్ల పాటు బ్రేక్ తీసుకుని తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన నదియాకు సినిమా అంటే ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆమె ఇద్దరు కూతుర్లను మాత్రం ఎందుకు ఇండస్ట్రీలోకి తీసుకు రావడం లేదు అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి నదియా ఇద్దరు కూతుర్లలో కనీసం ఒక్కరు అయినా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా అడుగు పెడితే బాగుంటుంది కదా అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. కానీ వారిలో ఏ ఒక్కరికి ఆసక్తి లేనప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉండటం ఉత్తమం కదా అంటూ కొందరు వారి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉన్నారు.