నా ఎక్స్ హ్యాక్ అంటూ షాకిచ్చిన నయనతార!
సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం పరిపాటే. భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకు న్నా సెలబ్రిటీల అకౌంట్లు మాత్రం హ్యాక్ అవుతూనే ఉన్నాయి.
By: Tupaki Desk | 13 Sep 2024 11:16 AM GMTసెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ అవ్వడం పరిపాటే. భద్రత పరంగా ఎలాంటి చర్యలు తీసుకు న్నా సెలబ్రిటీల అకౌంట్లు మాత్రం హ్యాక్ అవుతూనే ఉన్నాయి. స్టార్ హీరో నుంచి సామాన్యుడి ఖాతా వరకూ ఎవర్నీ విడిచిపెట్టడం లేదు హ్యాకింగ్ దొంగలు.టెక్నాలజనీ అందిపుచ్చుకుని మార్కెట్ హ్యాకింగ్ దొంగలు అంతకంతకు రెట్టింపు అవుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవరించినా జేబులు గుల్ల అవ్వడం కూడా అంతే వేగంగా జరుగుతుంది.
తాజాగా లేడీ సూపర్ స్టార్ నయనతర ఎక్స్ (ట్విట్టర్) ఖాతా హ్యాక్ అయినట్లు తెలిపింది. తన అకౌంట్ నుంచి వచ్చే సందేశాలకు కానీ, ట్విట్లకు కానీ స్పందించకండి అంటూ నయనతార ఎక్స్ వేదికగా రాసుకో చ్చింది. తన అకౌంట్ హ్యాక్‌పై సైబర్ పోలీసులకు కంప్లయింట్ చేశానని త్వరలోనే మీ ముందుకు వస్తానని వెల్లడించింది. నయనతార కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తన నుంచి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వాలి అన్నా? ఎక్స్..ఇన్ స్టాలను వినియోగిస్తుంటుంది. సినిమా విశేషాలకన్నా ఎక్కువగా వెకేషన్లకు వెళ్లిన ఫోటోలు..వీడియోలు షేర్ చేస్తుంటుంది. సినిమాలకు సంబంధించి తన సొంత ప్రొడక్షన్ హౌస్ చిత్రాలు తప్ప బటయ చిత్రాల్ని ప్రమోట్ చేయదు.
ఇక నయనతార సినిమాల విషయానికి వస్తే.. గతేడాది `జవాన్`, `అన్నపూరణి` సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం `టెస్ట్` సినిమాతో పాటు `తని ఒరువన్ పార్ట్ 2`, `మన్నన్‌గట్టి 1960`, `డియర్ స్టూడెంట్స్ `అనే సినిమాలు చేస్తోంది..