Begin typing your search above and press return to search.

హీరోయిన్ త‌ల్లి పిలుపు కోసం వెయిటింగ్!

మ‌రి అవ‌కాశాలు రాక దూరంగా ఉందా? వ‌చ్చిన వ‌ద్ద‌నుకుంటుందా? అన్న‌ది తెలియ‌దు గానీ ఈ అమ్మ‌డు కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకుంది.

By:  Tupaki Desk   |   11 Feb 2025 11:30 AM GMT
హీరోయిన్ త‌ల్లి పిలుపు కోసం వెయిటింగ్!
X

ఢిల్లీ బ్యూటీ ప‌ద్మ‌ప్రియ మాలీవుడ్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన హీరోయిన్. అమ్మ‌డి ఎంట్రీ ముందుగా తెలుగులో `శీను వాసంతి ల‌క్ష్మి` తో జ‌రిగినా అటుపై మాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదిగింది. రెండేళ్ల క్రితం వ‌ర‌కూ ప‌ద్మిప్రియ మాలీవుడ్ లో బిజీగానే ఉంది. ఈ రెండేళ్ల‌గానే ఆమె సినిమాల‌కు దూరంగా ఉంది. మ‌రి అవ‌కాశాలు రాక దూరంగా ఉందా? వ‌చ్చిన వ‌ద్ద‌నుకుంటుందా? అన్న‌ది తెలియ‌దు గానీ ఈ అమ్మ‌డు కొన్ని వ్య‌క్తిగ‌త విష‌యాలు పంచుకుంది.

ప‌ద్మ‌ప్రియ చిర‌కాల మిత్రుడు జాస్మిన్ షాను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరి పెళ్లై రెండు ద‌శాబ్దాలవుతుంది. అయితే ఇంత‌వ‌ర‌కూ ఈ దంప‌తుల‌కు సంతానం లేదు. ఇప్పుడు పిల్ల‌ల‌ను క‌నాల‌ని..వాళ్ల‌తో అమ్మ అనే పిలుపు పిలుపించుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంది. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా రివీల్ చేసింది. ఒక‌ప్పుడు పెళ్లే వ‌ద్ద‌ను కున్నాను. కానీ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాను. సినిమాల్లోకి రాకూడ‌ద‌నుకున్నాను.

కానీ వ‌చ్చాను. సినిమాల‌కు బ్రేక్ తీసుకోకూడ‌ద‌నుకున్నాను. కానీ తీసుకున్నాను. అందుకే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో? ఎలాంటి మ‌లుపులు తిర‌గుతుందో చెప్ప‌లేం. సినిమాల ప‌రంగా న‌టీన‌టుల‌కు బ్రేక్ అవ‌స‌రం. నా బ్రేక్ అనంత‌రం మ‌ళ్లీ ఇప్పుడు సినిమాలు చేయాల‌ని ఉందని తెలిపింది. బ్రేక్ తీసుకోవ‌డానికి ఓ కార‌ణం ఉంది. న‌టీగా నా ప్ర‌యాణం అంత సులువుగా సాగ‌లేదు. ఎన్నో స‌వాళ్లు..ఒత్తిళ్లు ఎదుర్కున్నాను.

ఛాలెంజింగ్ రోల్స్ చేసినా? మంచి అవ‌కాశాలు త్వ‌ర‌గా వ‌చ్చేవి కాదు. ఈ క్ర‌మంలో బోలెడంత స‌మ‌యాన్ని వృద్ధా చేసానని తెలిపింది. మాలీవుడ్ లో ప‌ద్మ‌ప్రియ చాలా సినిమాలు చేసింది. న‌టిగా ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించు కుంది. శీను వాసంతి ల‌క్ష్మి త‌రువాత అంద‌రి బంధువ‌యా, ప‌టేల్ సార్ లాంటి చిత్రాల్లో న‌టించింది.