Begin typing your search above and press return to search.

చిట్టి పొట్టి చిన్నారి పాయ‌ల్ ఫోటోగ్ర‌ఫీ చూశారా?

చిట్టి పొట్టి చిన్నారి పాయ‌ల్ రాజ్ పుత్ ఫోటోగ్ర‌ఫీ స్టింట్ చూశారా? ``అందంగా ఫోటోలు తీయ‌బ‌డును!`` అనే బోర్డ్ ఆ ముఖంలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది

By:  Tupaki Desk   |   1 Sep 2024 5:25 AM GMT
చిట్టి పొట్టి చిన్నారి పాయ‌ల్ ఫోటోగ్ర‌ఫీ చూశారా?
X

చిట్టి పొట్టి చిన్నారి పాయ‌ల్ రాజ్ పుత్ ఫోటోగ్ర‌ఫీ స్టింట్ చూశారా? ``అందంగా ఫోటోలు తీయ‌బ‌డును!`` అనే బోర్డ్ ఆ ముఖంలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. ప్రొఫెష‌న‌ల్ అంటే ఇలా ఉండాలి! అనేంత‌గా ఒదిగిపోయి కనిపిస్తోంది. ఒక పక్కా ప్రొఫెష‌న‌ల్ కెమెరాఉమెన్‌లా అలా మెడ‌లో కొడాక్ కెమెరాను త‌గిలించుకుని వీధుల వెంబ‌డి ప‌రిశీల‌నకు బ‌య‌ల్దేరింది. కానీ ఇలా న‌వ్వులు చిందిస్తుంటేనే అస‌లు స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.

ఆ ఖ‌రీదైన కెమెరా.. దాని కోసం ఒక న‌ల్ల‌ని లెద‌ర్ బ్యాగ్.. ఎంత జాగ్ర‌త్త‌! అంతేకాదు.. అప్పుడే స్కూటీ దిగి వ‌చ్చిందేమో.. ఆ హెల్మెట్ కూడా ఇంకా తీయ‌లేదు. ఎరుపు రంగు టాప్ అండ్ బాట‌మ్ చూడ‌గానే కుర్ర‌కారు కిసుక్కున న‌వ్వుకోవాల్సిందే. ఇంత‌గా చిట్టి పొట్టి దుస్తుల్లో ఇటీవ‌ల క‌నిపించ‌నందుకు పాయ‌ల్ అభిమానులు అల‌క‌బూనారు పాపం!

అదంతా స‌రేకానీ .. పాయ‌ల్ కి ఉన్న‌ట్టుండి ఇలా ఫోటోగ్ర‌ఫీ పిచ్చి ప‌ట్టిందేమిటో! అలా కెమెరా మెడ‌లో వేసుకుని ఆరు బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అలా వ‌చ్చేప్పుడు పూర్తిగా బ‌ట్ట‌లు అయినా తొడుక్కోవ‌డం మ‌ర్చిపోయిందేమిటో! అంటూ కొంద‌రు నెటిజ‌నులు పంచ్ లు విసిరేస్తున్నారు. ఏది ఏమైనా ఈ యూనిక్ లుక్ ఇన్ స్టంట్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఇక కెరీర్ ప‌రంగాను పాయ‌ల్ తిరిగి అద్భుత‌మైన‌ బ్లాక్ బ‌స్ట‌ర్ తో కంబ్యాక్ అవుతుందేమో చూడాలి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పాయ‌ల్ కి ఆర్.ఎక్స్ 100 త‌ర్వాత మ‌ళ్లీ అలాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌డ‌లేదు. ప్ర‌స్తుతం గోల్ మాల్- ఏంజెల్-కిరాత‌క అనే మూడు సినిమాల్లో పాయ‌ల్ న‌టిస్తోంది. త‌న సినిమాల విడుద‌ల‌ల గురించి పాయ‌ల్ చెబుతుందేమో వేచి చూడాలి.