సెట్ లో ముద్దు పెడితే ఏడుస్తూ వెళ్లిపోయిన హీరోయిన్!
అయితే హీరో ఆమెకి చెప్పకుండానే ముద్దు పెడతాడుట. దీంతో ఆమె షాక్ కి గురై ఏడుచుకుంటూ అక్కడ నుంచి కోపగించుకుని వెళ్లిపోయారుట.
By: Tupaki Desk | 26 Oct 2024 12:30 PM GMTబాలీవుడ్ ఎవ్వెర్ గ్రీన్ వెటరన్ నటి రేఖ గురించి చెప్పేదేముంది. అప్పటి తరం హీరోయిన్లలో రేఖ ఓ లెజెండరీ నటి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. మరెన్నో వైవిథ్యమైన పాత్రలతో భారతీయ ప్రేక్షకుల్ని అలరించిన నటి. అప్పటి తరం హీరోలందరితో నటించిన నటి. ఇప్పటికీ రేఖ ఏదైనా సినిమా ఈవెంట్ కు హాజరవుతున్నారంటే? ఆ వేడుక ఎంతో శోభాయమానంగా మారుతుంది. నేటికి ఐఫా వేడుకల్లో ఆమె లైవ్ పెర్మార్మెన్స్ ఇస్తున్నారు.
ఇలా చేయడం ఎంత మందికి సాధ్యం అంటే? భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఆమెపేరును సువర్ణాక్షరాలతో లిఖించాలి. ఓలెజెండరీ నేటికి తనలో ఫ్యాషన్ ని ఆ రకంగా చాటుకోవడం అన్నది ఎంతో గొప్ప విషయం. మరి అలాంటి రేఖ కి ఆన్ సెట్స్ లో ఓచేదు అనుభవం ఎదురైంది? అంటే నమ్ముతారా? కానీ ఇది నమ్మాల్సిన నిజం. 1969లో రేఖ బిస్వజిత్ ఛటర్జీ సరసన నటించారు. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లు.
అయితే ఓ సన్నివేశం డిమాండ్ లో భాగంగా రొమాంటిక్ చేయాల్సి ఉందని దర్శకుడు కోరారు. అందుకు ఆమె కూడా ఒప్పుకున్నారు. అయితే హీరో ఆమెకి చెప్పకుండానే ముద్దు పెడతాడుట. దీంతో ఆమె షాక్ కి గురై ఏడుచుకుంటూ అక్కడ నుంచి కోపగించుకుని వెళ్లిపోయారుట. యూనిట్ అంతా ఖంగుతిందిట. అలా వెళ్లిపోయింది? ఏంటి? అందరిలో పెద్ద ఎత్తున డిస్కషన్ సాగిందిట. మరి ఆమెని చివరికి ఎలా బుజ్జగించి ఒప్పించారు? అన్నది తర్వాత సంగతి.
ఈ విషయాన్ని రేఖ ది అన్ టోల్డ్ స్టోరీలో పొందు పరిచారు. ఇంకా రేఖ వ్యక్తిగత జీవితం గురించి చాలా విషయా లున్నాయి. నటిగా ఆమె ప్రయాణం మొదలైన నాటి నుంచి ఎదిగిన వైనం..ఆ క్రమంలో ఆమె ఎదుర్కున్న ఇబ్బం దులు..ఓ స్టార్ హీరో కారణంగా ఆమె ఎంతటి క్షోభకు గురయ్యారు? ఇలా చాలా సంగతులే ఉన్నాయి.