Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా పట్టించుకోని హీరోయిన్..?

మలయాళ ప్రేమం తో సౌత్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 1:30 PM GMT
ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నా పట్టించుకోని హీరోయిన్..?
X

మలయాళ ప్రేమం తో సౌత్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదాతో ఎంట్రీ సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా నుంచి మొదలు పెడితే సాయి పల్లవి ఉంది అంటే చాలు సినిమా పక్కా హిట్ అనే రేంజ్ క్రేజ్ తెచ్చుకుంది. కథల ఎంపికలో కూడా సాయి పల్లవి తన స్పెషాలిటీ చూపిస్తూ ఏమాత్రం గ్లామర్ షో చేయకుండా సినిమాలు చేస్తూ వస్తుంది. ఐతే ఈ క్రమంలో అమ్మడు చాలా సెలెక్టెడ్ సినిమాలు చేయడం వల్ల ఆమె ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు.

సాయి పల్లవి చివరి సినిమా విరాట పర్వం వచ్చి రెండేళ్లు అవుతుంది. ఆ సినిమా తర్వాత ఈమధ్యనే నాగ చైతన్య తండేల్ కు సైన్ చేసింది. రెండేళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు అమ్మడు. ఐతే అమ్మడు సౌత్ ని వదిలి బాలీవుడ్ బాట పట్టడం వల్లే ఇక్కడ సినిమాలు చేయలేకపోతుందని అంటున్నారు. సాయి పల్లవి ఇప్పటికే బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ రామాయణం తో పాటుగా మరో సినిమా చేస్తుంది. తమిళ్ లో కూడా శివ కార్తికేయన్ తో ఒక సినిమా చేస్తుంది.

తెలుగులో తండేల్ తప్ప మరో సినిమా ఓకే చేయని సాయి పల్లవి మిగతా భాషల్లో మాత్రం వరుస సినిమాలు చేస్తుంది. దానికి రీజన్ సాయి పల్లవికి తెలుగు నుంచి సరైన కథలు రావట్లేదని టాక్. ఎలాంటి సినిమా పడితే అలాంటి సినిమా చేయకూడదు అనుకున్న సాయి పల్లవి తన మనసుకి నచ్చిన కథలను మాత్రమే ఓకే చేస్తుంది. ఐతే తనకు ఇంత స్టార్ క్రేజ్ వచ్చేలా చేసిన తెలుగు పరిశ్రమకి సాయి పల్లవి దూరం అవ్వడం ఆమె ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తుంది.

ఐతే తండేల్ హిట్ పడితే అమ్మడు మళ్లీ ఇక్కడ బిజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ చైతన్యతో లవ్ స్టోరీ సినిమా చేసి సక్సెస్ అందుకుంది కాబట్టి సాయి పల్లవి హిట్ సెంటిమెంట్ తండేల్ కి కూడా కలిసి వచ్చేలా ఉంటుందని చెప్పొచ్చు. మరి తండేల్ తర్వాత సాయి పల్లవి నెక్స్ట్ తెలుగు సినిమా ఏది అవుతుంది అన్నది వేచి చూడాలి. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండేల్ సినిమా మాత్రం గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.