Begin typing your search above and press return to search.

సీనియర్‌ హీరోయిన్‌ మనోవేదన

ఇటీవల ఒక స్టార్‌ హీరోతో సిమ్రాన్‌ సినిమా అంటూ పుకార్లు షికార్లు చేయడంతో పాటు, ఆమె గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

By:  Tupaki Desk   |   22 Sep 2024 1:30 PM GMT
సీనియర్‌ హీరోయిన్‌ మనోవేదన
X

తెలుగు తో పాటు ఇతర సౌత్‌ భాషల్లో హీరోయిన్‌ గా మెప్పించిన సిమ్రాన్‌ ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. తాజాగా ఈమె గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం తారా స్థాయికి చేరింది. ఆ విమర్శలపై సిమ్రాన్‌ స్పందించింది. తన గురించి ఇన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం పై ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఇన్నాళ్లు నిశబ్దంగా ఉన్న తాను ఇకపై సైలెంట్‌ గా ఉండాలని భావించడం లేదని చెప్పుకొచ్చింది. సినిమాల్లో నటిస్తున్న విషయమై వస్తున్న వార్తలను ఆమె కొట్టి పారేసింది.

ప్రస్తుతం నేను ఫ్యామిలీ తో లైఫ్ ని సంతోషంగా సాగిస్తున్నాను. అంతే తప్ప పెద్ద హీరోలతో సినిమాలు చేయాలని ఆశ పడటం లేదు. ముందు ముందు కూడా నేను నా వర్క్‌ ను కొనసాగించాలని భావిస్తున్నాను, కానీ కొందరు మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు మాత్రం ఇప్పటి వరకు కొత్త ప్రాజెక్ట్‌ లను కమిట్‌ అవ్వలేదు అంది. ఇటీవల ఒక స్టార్‌ హీరోతో సిమ్రాన్‌ సినిమా అంటూ పుకార్లు షికార్లు చేయడంతో పాటు, ఆమె గురించి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకే సిమ్రాన్‌ సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది.

ఒకరితో ముడి పెడుతూ సోషల్‌ మీడియాలో గతంలో చాలా సార్లు వార్తలు వచ్చాయి, ఇన్నాళ్లు అన్ని వార్తలకు, పుకార్లకు సైలెంట్‌ గా ఉన్నాను. కానీ ఇప్పుడు మరింత శృతి మించుతున్నాయి. ఆ వార్తలను ఇకపై అయినా ఆపకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఆమె హెచ్చరించింది. నాకంటూ ఆత్మ గౌరవం ఉంటుంది. దానికే నేను మొదటి ప్రాధాన్యత ఇస్తాను. నా పేరును ఎవరూ దుర్వినియోగం చేసేందుకు వీలు లేదు. నేను ఎప్పుడూ సరైన దాని కోసం నా మాట వినిపించాను. ఇండస్ట్రీ నుంచి నేను ఆ విషయంను నేర్చుకున్నాను. నా గురించి తప్పుడు వార్తలు రాస్తున్న వారు వెంటనే క్షమాపణలు చెప్పాలి.

సౌత్ స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, సూర్య, అజిత్‌, విజయ్‌ లతో పాటు ఎంతో మంది స్టార్‌ హీరోలతో సినిమాలు నటించిన సిమ్రాన్ ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే త్వరలో ఆమె రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రం తెలుస్తోంది. సిమ్రాన్ కి సీనియర్‌ హీరోయిన్‌ గా మంచి ఫేమ్ ఉంది. ఆ ఫేమ్‌ ను కొందరు ఉపయోగించుకుని పుకార్లు పుట్టిస్తూ వస్తున్నారు. ఆ విషయమై సిమ్రాన్ చాలా సీరియస్ గా స్పందించింది. ఇప్పటికి అయినా సిమ్రాన్‌ గురించి వస్తున్న పుకార్లు, వార్తలు ఆగిపోతాయేమో చూడాలి.