Begin typing your search above and press return to search.

బికినీ బ్యూటీ సోనాల్ ప‌ర్ఫెక్ట్ టోన్డ్ లుక్

బాల‌య్య-బోయ‌పాటి కాంబినేష‌న్ సినిమాల్లో న‌టించిన ఈ ముంబై బ్యూటీ కెరీర్ లో కొన్ని చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకుంది

By:  Tupaki Desk   |   4 March 2025 9:02 AM IST
బికినీ బ్యూటీ సోనాల్ ప‌ర్ఫెక్ట్ టోన్డ్ లుక్
X

సోనాల్ చౌహాన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల‌య్య-బోయ‌పాటి కాంబినేష‌న్ సినిమాల్లో న‌టించిన ఈ ముంబై బ్యూటీ కెరీర్ లో కొన్ని చెప్పుకోద‌గ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను అందుకుంది. అయితే స‌క్సెస్ ఉన్నా ఈ భామ‌కు ఏదీ క‌లిసి రాలేదు.

ప్ర‌భాస్ `ఆదిపురుష్` చిత్రంలో అతిథి పాత్ర‌లో క‌నిపించిన ఈ బ్యూటీ బంగ్లాదేశ్ కి చెందిన ప్రముఖ పంపిణీదారుడు నిర్మిస్తున్న ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీలో ఛాన్స్ క‌ల్పించాడు. థ‌ర్డ్ పేరుతో ఈ మూవీ డాలీవుడ్ (బంగ్లాదేశ్) లో విడుదల కావాల్సి ఉంది. అయితే దానికి సంబంధించిన స‌రైన అప్ డేట్ లేదు.

సౌత్ లో అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో సంబంధాలు ఉన్నా, హిందీ ప‌రిశ్ర‌మ‌ను సోనాల్ ఎప్ప‌టికీ వ‌దిలిపెట్ట‌దు. తాజాగా సోనాల్ చౌహాన్ షేర్ చేసిన ఫోటోషూట్ ఒక‌టి అంత‌ర్జాలంలో సునామీ స్పీడ్ తో దూసుకుపోతోంది. సోనాల్ మ‌తిచెడే బికినీ ఫోటోషూట్ లో టోన్డ్ లుక్ తో ఆక‌ట్టుకుంది. త‌న క‌ళ్ల‌కు అంద‌మైన బ్లాక్ రేబాన్ ని ధ‌రించి మోడ్ర‌న్ ట‌చ్ ఇచ్చింది.

బికినీపై మెస్సీ స్లిప్ ఆన్ డ్రెస్ ధ‌రించిన చౌహాన్ ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. సోనాల్ స్పెష‌ల్ ఫోటోషూట్ వేగంగా యూత్ లోకి దూసుకెళుతోంది. వ‌రుస ఫోటోషూట్ల‌తో గ్యాప్ లెస్ గా సోనాల్ ప్ర‌య‌త్నం చూసి, తిరిగి టాలీవుడ్ అవ‌కాశాలు క‌ల్పిస్తుందేమో చూడాలి.