Begin typing your search above and press return to search.

అద్దె ఇల్లు కూడా దొర‌క్కుండా చేసాడు నా భ‌ర్త‌!

బాల‌న‌టి సుల‌క్ష‌ణ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల‌న‌టిగా ఆమెకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది.

By:  Tupaki Desk   |   26 Sep 2024 8:30 AM GMT
అద్దె ఇల్లు కూడా దొర‌క్కుండా చేసాడు నా భ‌ర్త‌!
X

బాల‌న‌టి సుల‌క్ష‌ణ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. బాల‌న‌టిగా ఆమెకి ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. 100 సినిమాల‌కు పైగా న‌టించారామే. `డాలీ` పేరుతో బాలనటిగా ఎంతో ఫేమ‌స్. సులక్షణ పేరు చెప్పగానే అంద‌రికీ `శుభోదయం` గుర్తొస్తుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ సినిమాలు చేసారు. ప్ర‌స్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. తాజాగా సుల‌క్ష‌ణ వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసారు.

`నేను 18 ఏళ్లకే పెళ్లి చేసుకున్నాను. 23 ఏళ్లు వచ్చేసరికి ఇద్దరు పిల్లలు . విడాకులు కూడా అయిపోయాయి. ఎందుకు విడిపోయామనేది? నేను పూర్తిగా చెప్పలేను. ప్రేమించి పెళ్లి చేసుకు న్నాము. కానీ పెళ్లి తరువాత ఆ ప్రేమ ఎంతో కాలం నిలబడలేదు. పిల్లలు అవసరం లేదని ఆయన కోర్టులోనే చెప్పారు. దీంతో ఇద్దరు పిల్లలతో, కట్టుబట్టలతో ఉన్న ఇంటిని వ‌దిలేసి బయటికి వచ్చాను. నాకు రెంట్ ఇల్లు కూడా దొరక్కుండా చేయాలని ఆయన చూశారు.

అత్తమామలు పట్టించుకోకపోవడం కూడా ప‌ట్టించుకోలేదు. దీంతో ఒంటరి పోరాటం మొదలుపెట్టాను. చివ‌రికి నా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మంచి మనిషి ఇల్లు అద్దెకి ఇచ్చారు. ఆ స‌మ‌యంలో నా ద‌గ్గ‌ర పాలడబ్బాకి కూడా డబ్బులు లేవు. 6 నెలల వరకూ పాల డబ్బాలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో నా `ముక్కుపుడక` అమ్మేశాను. ఆ డబ్బుతో పాల డబ్బాలు తెచ్చిపెట్టుకున్నాను.

నాకు సినిమా తప్ప ఏమీ తెలియదు. అందువల్లే మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టాను . క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్ గా మారాను. నా పిల్లల భవిష్యత్తు కోసమే నేను మళ్లీ పెళ్లి గురించిన ఆలోచన చేయలేదు. నా కష్టాలు ఎవరికీ చెప్పుకోనూ లేదు` అన్నారు. అలాగే సుల‌క్ష‌ణ‌...లెజెండ‌రీ న‌టి సావిత్ర‌తో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.