Begin typing your search above and press return to search.

బూజు ప‌ట్టిన ఇంట్లో సావిత్రి 5 ఏళ్ల పాప‌లా ముడిచుకుపోయి!

వెండి తెర వెలుగు మ‌హాన‌టి సావిత్రి ప్ర‌స్థానం గురించి చెప్పేదేముంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 7:30 AM GMT
బూజు ప‌ట్టిన ఇంట్లో సావిత్రి  5 ఏళ్ల పాప‌లా ముడిచుకుపోయి!
X

వెండి తెర వెలుగు మ‌హాన‌టి సావిత్రి ప్ర‌స్థానం గురించి చెప్పేదేముంది. 300కు పైగా చిత్రాల్లో న‌టించిన లెజెండ‌రీ న‌టి. మూడు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో ఎన్నో సంచ‌ల‌నాలు న‌మెదు చేసారు. ఆమె చేయ‌న‌టి వంటి పాత్ర‌లేదు. పాత్ర‌కే వ‌న్న తీసుకొచ్చిన గొప్ప మ‌హాన‌టి. న‌టిగా దేశ వ్యాప్తంగా ఎంతోఫేమ‌స్. గోప్ప సేవాదృక్ఫ‌ధం గ‌ల న‌టి. స‌హాయం అంటూ ఆమె ఇంటి గుమ్మం తొక్కితే దొర‌క‌ని స‌హాయం అంటూ ఉండేది కాదు.

అలా ఎంతో మందికి సాయం అందించిన చేయి ఆమెది. డ‌బ్బు కాదు..మ‌నుషులు మాత్ర‌మే శాశ్వతం అని న‌మ్మిన న‌టి. అలాంటి లెజెండ‌రీ న‌టి చివ‌రి జీవితం ఎంతో దుర్భ‌రంగా సాగింద‌ని అంతా చెప్పుకుం టారు. తాజాగా ప్ర‌ముఖ న‌టి సుల‌క్ష‌ణ ఓ ఇంట‌ర్వ్యూలో సావిత్రి గురించి మ‌రిన్ని విష‌యాలు పంచుకు న్నారు. డాలీ పేరుతో బాలనటిగా 100కి పైగా సినిమాలు చేశారు సుల‌క్ష‌ణ‌. సులక్షణ పేరు చెప్పగానే అంద‌రికీ `శుభోదయం` గుర్తొస్తుంది.

తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాష‌ల్లోనూ సినిమాలు చేసారు. ప్ర‌స్తుతం ఆమె చెన్నైలో నివాసం ఉంటున్నారు. `బాలనటిగా అప్పటి స్టార్ హీరోయిన్స్ అందరితో కలిసి నటించాను. వాళ్లంతా నన్ను ఎంతో గారాబంగా చూసుకునేవారు. అలా ఎస్వీఆర్ , సావిత్రిగారి తో వారితో మంచి సాన్నిహిత్యం ఏర్ప‌డింది. సావిత్రి గారి చివరి రోజులలో ఆమెను చూడాలనిపించింది. ఆమెను చూడాలని ఉందని జెమినీ గణేశన్ గారిని అడిగాను. అడ్ర‌స్ క‌నుక్కుని సావిత్రి గారి ఇంటికి వెళ్లాను.

అది ఒక పాత ఇల్లు. బూజులు పట్టి ఉంది. ఫ్యాన్ కూడా లేదు. సావిత్రిగారు మనలో లేరు. ఆమె చాలా భారీ మనిషి. అలాంటి ఆమె ఐదేళ్ల పాపలా ముడుచుకుపోయి ఉన్నారు. ఆమె ఒళ్లంతా ట్యూబ్స్ పెట్టారు. చాలా నల్లగా అయిపోయారు. ఆమెను చూసుకోవడానికి అక్కడ ఒక మనిషి ఉన్నారు. ఆ స్థితిలో నేను సావిత్రి గారిని చూడలేకపోయాను. ఎంతోమందికి ఎన్నో దానధర్మాలు చేసిన ఆమెను అలా చూసి తట్టుకోలే కపోయాను. ఆమెకి ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చిందేంట‌ని చ‌లించిపోయాను. కానీ సావిత్రి గారు చేసిన దానధర్మాలతో తప్పకుండా స్వర్గానికే వెళతారు` అని అన్నారు.