ఫోటో స్టోరి: సీనియర్ నటి స్టన్నింగ్ అవతార్
లేటు వయసులో ఘాటు ఫోజులతో అదరగొడుతోంది సీనియర్ నటి టబు. ఏజ్ లెస్ బ్యూటీగా ఈ భామ ఫీట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 27 Jan 2025 2:30 AM GMTలేటు వయసులో ఘాటు ఫోజులతో అదరగొడుతోంది సీనియర్ నటి టబు. ఏజ్ లెస్ బ్యూటీగా ఈ భామ ఫీట్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే `క్రూ` చిత్రంలో కృతి సనోన్ లాంటి యంగ్ బ్యూటీతో పోటీపడుతూ గ్లామరస్ పాత్రలో నటించిన టబు ఏజ్ నిజానికి 53. అయినా వయసును కనిపించకుండా తన ఛామింగ్ లుక్స్ తో దాచేస్తోంది ఈ బ్యూటీ.
ఇటీవల స్టన్నింగ్ ఫోటోషూట్స్ తో టబు మ్యాజిక్ చేస్తోంది. నేటితరంతో పోటీపడుతున్న ఈ బ్యూటీ వరుస ఫోటోషూట్లను ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా మరో కొత్త ఫోటోషూట్‌తో టబు అభిమానుల ముందుకు వచ్చింది. ఇన్‌స్టాలో టబు షేర్ చేసిన ఫోటోగ్రాఫ్‌లో లాంగ్ ట్రెంచ్ కోట్ ధరించి చాలా స్పెషల్ గా కనిపిస్తోంది. `కొన్నిసార్లు సండే షాట్స్!` అంటూ ఈ యూనిక్ ఫోటోషూట్ ని షేర్ చేసింది. టబు ఈ లుక్ లో సింపుల్ గా ప్రయోగాత్మకంగాను కనిపిస్తోంది. ప్రస్తుతం ఇది యువతరం హృదయాలను గెలుచుకుంటోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఇటీవలే `డ్యూన్ ప్రొఫెసీ` అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రంలో నన్ పాత్రలో అద్భుతమైన నటనతో టబు ఆకట్టుకుంది. లైఫ్ ఆఫ్ పై సహా పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన టబుకు ఇది పెద్ద ఆఫర్. తదుపరి అక్షయ్ కుమార్ తో కలిసి బూత్ బంగ్లాలో కనిపించనుంది. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ హారర్-కామెడీ చిత్రం ఇటీవలే షూటింగ్ ని పూర్తి చేసుకుంది. చివరి రోజు తన బృందంతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక సెల్ఫీ దిగి దానిని టబు షేర్ చేయగా వైరల్ గా మారింది. భూల్ భూలైయా విడుదలైన 14 సంవత్సరాల తర్వాత అక్షయ్ కుమార్ -ప్రియదర్శన్ తిరిగి కలిసి వస్తున్నారు. ఇరవై ఏళ్ల తర్వాత అక్షయ్ తో కలిసి టబు ఈ సినిమాలో నటించింది. ఈ చిత్రం 2 ఏప్రిల్ 2025న విడుదల కానుంది.