పెళ్లిలో ద్రోహాన్ని తట్టుకోలేనన్న త్రిష
తనదైన అందం నటనతో దశాబ్ధాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి, గత పెళ్లి ప్రయత్నం వైఫల్యం గురించి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Sep 2024 11:30 AM GMTతనదైన అందం నటనతో దశాబ్ధాల పాటు ప్రేక్షకుల్ని అలరించిన అగ్ర కథానాయిక త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితం గురించి, గత పెళ్లి ప్రయత్నం వైఫల్యం గురించి తెలిసిందే. ఆ తర్వాత త్రిష చాలా కాలంగా ఈ విషయంలో స్థబ్ధుగానే ఉండిపోయింది. కానీ పెళ్లి గురించి త్రిష ఎప్పుడూ విముఖతను వ్యక్తం చేయలేదు. నమ్మకం గురించి మాట్లాడింది. త్రిష తన ఆలోచనలను ఒక త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో వెల్లడించినది మళ్లీ వైరల్ అవుతోంది. నిజంగా నచ్చినవాడితో జీవితాన్ని గడపడంలో ప్రాముఖ్యతను త్రిష ఈ ఇంటర్వ్యూలో నొక్కి చెప్పింది. అసంతృప్తి లేదా విడాకులను నివారించడానికి, భాగస్వామితో సుస్థిరత కోసం వేచి ఉండటానికే ఇష్టపడతానని త్రిష అంది. ద్రోహం -నిజాయితీ అనే భిన్న కోణాలు తనను ఎంతగా ప్రభావితం చేస్తాయో కూడా త్రిష వెల్లడించింది. తన మాటల్లో కొంతవరకూ పరిపూర్ణ ఆలోచనలను ఇది ధృవీకరిస్తోంది.
త్రిష కృష్ణన్ దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక వేవ్ అంటే అతిశయోక్తి కాదు. తనకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారు. నిరంతరం త్రిష వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వివాహంపై తన అభిప్రాయాలు ఎల్లప్పుడూ ఉత్సుకతను రేకెత్తిస్తాయి. పెళ్లంటూ చేసుకుంటే భర్తతో జీవితాంతం కలిసి ఉండాలనే తన బలమైన ఆకాంక్షను ఆ ఇంటర్వ్యూలో వ్యక్తం చేసింది. మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు.. జీవితాంతం తనతోనే ఉండాలనిపించే వ్యక్తి ఇతడే అనిపించాలని, అతడి కోసం ఎదురు చూడాలని కూడా త్రిష చెప్పింది. త్రిష కూడా పెళ్లి గురించి ఆలోచిస్తానని, అది నిశ్చయం(తుది నిర్ణయం) అనిపించినప్పుడు మాత్రమే ముందుకు వెళతానని అన్నారు. కాకపోతే వేచి ఉండటానికే ఇష్టపడతానని, ఏ పార్టీ (ఇరువర్గాలు) అయినా బాధపడటం లేదా సంతోషం లేకుండా జీవించడం ఇష్టం లేదని త్రిష వ్యాఖ్యానించింది. తప్పుడు సంబంధం పెట్టుకుని విడాకులు తీసుకోవడం తనకు ఇష్టం లేదని కూడా చెప్పింది. ద్రోహం మోసం తాలూకా బాధ తనపై ఎలా ప్రభావం చూపుతుందో త్రిష ఓపెన్ అయింది. ద్రోహంలో తన మొదటి ప్రతిచర్య కోపం అని వెల్లడించింది.
ప్రపంచం ఎలా ఉంటుందో వాస్తవాన్ని గ్రహించాలని, దానిని అంగీకరించాలని తన తల్లి తరచుగా గుర్తుచేస్తుందని కూడా త్రిష అన్నారు. సలహాలు ఎన్ని ఉన్నా కానీ, తాను విశ్వసించే వ్యక్తి తనను నిరాశపరచడాన్ని భరించడం కష్టమని త్రిష పేర్కొంది. మనసు విచ్ఛిన్నత గురించి త్రిష తెలిపింది. తనకు కష్టమైన రోజులు ఉన్నా.. తనను తాను పైకి తీసుకుని రావడం ఎల్లప్పుడూ తనపై ఆధారపడి ఉంటుందని కూడా త్రిష అంగీకరించింది. ఆ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ఇప్పుడు ఆసక్తిని కలిగిస్తోంది.