Begin typing your search above and press return to search.

50లోనూ ఇంత అందం ఏంటి మేడం

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా సినిమాతో హిందీతో పాటు సౌత్‌ ప్రేక్షకులను కూడా తన అభిమానులుగా మార్చుకున్న ఊర్మిళ మటోండ్కర్‌.

By:  Tupaki Desk   |   2 Sep 2024 3:30 PM GMT
50లోనూ ఇంత అందం ఏంటి మేడం
X

రామ్‌ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రంగీలా సినిమాతో హిందీతో పాటు సౌత్‌ ప్రేక్షకులను కూడా తన అభిమానులుగా మార్చుకున్న ఊర్మిళ మటోండ్కర్‌. కేవలం సినీ నటిగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకురాలిగా కూడా ఊర్మిళ సుపరిచితురాలు. చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఊర్మిళ హీరోయిన్‌ గా టర్న్‌ అయ్యి సుదీర్ఘ కాలం పాటు టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా సినిమాలు చేస్తూ వచ్చింది. కేవలం హిందీలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ భాషల్లో కూడా నటించడం తో దేశ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకుంది. వర్మ హీరోయిన్‌ గా పేరు పడ్డ ఊర్మిళ 2010 వరకు కంటిన్యూగా సినిమాలు చేస్తూ వచ్చింది.

ఊర్మిళ ప్రస్తుత ఏజ్‌ 50 ఏళ్లు. ఆమె వయసు పెరిగిన కొద్దీ అందం పెరిగిందా అన్నట్లుగా పెరుగుతూ వచ్చింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఊర్మిళ షేర్‌ చేసిన అందమైన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 50 ఏళ్ల వయసులో ఇంత అందం మరే హీరోయిన్‌ కి సాధ్యం కాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా మంది ఊర్మిళ వయసు 50 ఏళ్లు అయ్యి ఉండక పోవచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 30 ఏళ్ల వయసులో హీరోయిన్స్ ఎంత అందంగా ఉంటారో అంతే అందంగా ఈ 50 ఏళ్ల వయసులో కూడా ఊర్మిళ ఉందంటూ నెటిజన్స్ ఇంకా ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

1977 లో కర్మ అనే చిత్రంతో బాల నటిగా అరంగేట్రం చేసిన ఊర్మిళ 1983 లో చేసిన మటోండ్కర్‌ సినిమాతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మలయాళంలో అప్పట్లో చాణక్య సినిమాలో నటించింది. 1991 లో హిందీ సినిమా నరసింహా తో హీరోయిన్‌ గా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా అందమైన ఊర్మిళ కి వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగు లో ఊర్మిళ అంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. రామ్‌ గోపాల్ వర్మ తో అప్పటి నుంచే ఊర్మిళ కి పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన రంగీలా సినిమా ఊర్మిళ కెరీర్‌ ను పూర్తిగా మార్చేసింది.

1995 లో వచ్చిన రంగీలా సినిమాకు గాను ఊర్మిళ ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ కి నామినేట్ అయ్యింది. ఆ సినిమా తో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఊర్మిళ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏడాదికి మూడు నాలుగు సినిమాల చొప్పున చేస్తూ వచ్చింది. సౌత్ స్టార్‌ హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా చేసింది.

భారతీయుడు సినిమా లో ఊర్మిళ నటించి మరోసారి పాన్ ఇండియా స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకుంది. అప్పట్లోనే ఊర్మిళ కు హిందీ తో పాటు అన్ని భాషల్లో కూడా మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండేది. ఇప్పటికి కూడా ఆమె స్టార్‌ డమ్‌ ఏమాత్రం తగ్గలేదు. కానీ ఆమె మాత్రం పెద్దగా సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. ఇంకా ఇంత అందంగా ఉన్న ఊర్మిళ కనుక నటిస్తే సీనియర్‌ స్టార్‌ హీరోలు ఈమె తో నటించేందుకు ఆసక్తి చూపించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.