Begin typing your search above and press return to search.

రెమ్యునరేషన్ ఏడు వందలే.. బేబీ హీరోయిన్

Actress Vaishnavi Chaitanya

By:  Tupaki Desk   |   16 July 2023 1:25 PM GMT
రెమ్యునరేషన్ ఏడు వందలే.. బేబీ హీరోయిన్
X

బేబీ తో బిగ్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మొదట టిక్ టాక్ అలాగే యూట్యూబ్ షాట్స్ ద్వారా మంచి క్రేజ్ అందుకున్న ఆమె ఆ తర్వాత సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే ఒక వెబ్ సిరీస్ ద్వారా ఊహించని స్థాయిలో క్రేజ్ పెంచుకుంది. అందులో ఆమె హోమ్లీ లుక్కుతో కనిపించడంతో ఓ వర్గం కుర్రాళ్ళు అయితే ఫ్యాన్స్ అయిపోయారు.

ఇక ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు పోస్ట్ చేసినా కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అల..వైకుంఠపురములో సినిమాలో అమ్మడు హీరోకు చెల్లెలి పాత్రలో కనిపించింది. కానీ అదేమీ అంత ప్రాధాన్యత ఉన్న పాత్ర కాకపోయినప్పటికీ అమ్మడికి మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు ఆమెకు బేబీ సినిమా కంటే ముందుగానే చాలా అవకాశాలు వచ్చాయి.

కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలే చేయాలి అని వైష్ణవి చాలా జాగ్రత్తగా పడింది. ఇక మొత్తానికి సాయి రాజేష్ దర్శకత్వంలో చేసిన బేబీ సినిమా మాత్రం బ్యూటీకి ఊహించని స్థాయిలో క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమ్మడు తన తొలి పారితోషకం గురించి కూడా చెప్పింది. టిక్ టాక్ ద్వారా అలాగే యూట్యూబ్ షాట్స్ ద్వారా కొంత క్రేజ్ వచ్చినప్పుడు కొన్ని ఈవెంట్స్ లలో కూడా డాన్స్ చేసే అవకాశాలు వచ్చాయట.

అయితే నాకు మొట్టమొదట మాత్రం ఈవెంట్లో డాన్స్ చేయాలని అనుకున్నప్పుడు కేవలం 700 రూపాయల పారితోషకం మాత్రమే దక్కింది. ఇప్పుడు నాకు ఎంత వస్తున్నా కూడా ఆ మొదటి పారితోషకాన్ని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. బేబీ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ సీన్స్ లో అయితే కథకు సెట్ అవుతాయని మాత్రమే చేశాను.

ఇక లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా ఏమీ ఫీల్ కాలేదు. కథకు తగ్గట్టుగా ఆడియన్స్ ఎలాగైతే ఫీలయ్యారో నా కుటుంబ సభ్యులు కూడా అదే తరహాలో రియాక్ట్ అయ్యారు అని వైష్ణవి చైతన్య వివరణ ఇచ్చింది. ఇక వీలైనంత వరకు మంచి కంటెంట్ ఉన్న కథలు మాత్రమే చేస్తాను అని, చేసేది తక్కువ సినిమాలు అయినా ఎప్పటికీ గుర్తిండి పోయేలా చేయాలనే భావనతో ఉన్నట్లు వివరణ ఇచ్చింది.