వేశ్య అంటూ వేధించారు: అదా శర్మ
ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. భారతదేశం నుండి నక్సల్స్ నిర్మూలన కోసం పోరాడే IPS అధికారిణి నీర్జా మాధవన్ పాత్రలో అదా శర్మ నటించింది
By: Tupaki Desk | 24 March 2024 5:17 AM GMTఅదా శర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నితిన్ 'హార్ట్ ఎటాక్' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన ఈ బ్యూటీకి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో అదా లుక్, గ్లామర్ యూత్ హృదయాలను టచ్ చేసాయి. కానీ తెలుగులో ఆశించినంత మైలేజ్ రాలేదు ఎందుకనో. అయితే ఇటీవలే ది కేరళ స్టోరీ బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత అదా శర్మ ఇమేజ్ అమాంతం పెరిగింది. దర్శకుడు సుదీప్తో సేన్ -నిర్మాత విపుల్ అమృతలాల్ షాలతో కలిసి ఇప్పుడు 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'లో నటించింది.
ఇది పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. భారతదేశం నుండి నక్సల్స్ నిర్మూలన కోసం పోరాడే IPS అధికారిణి నీర్జా మాధవన్ పాత్రలో అదా శర్మ నటించింది. అడవుల్లో సాహసోపేతమైన ఆపరేషన్స్ లో పాల్గొనే పోలీస్ అధికారిణిగా అదా శర్మ నటనకు పేరొచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆడలేదు. 'ది కేరళ స్టోరి' తొలి వారంలో 81కోట్లు వసూలు చేయగా, 'బస్తర్' తొలి వారంలో కేవలం 3 కోట్లు మాత్రమే వసూలు చేయడం నిరాశపరిచింది.
టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత ఇది ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమేనని ప్రచారమైంది. ఇది 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'ని దెబ్బ కొట్టిందని విశ్లేషిస్తున్నారు. వివాదాస్పద చిత్రం 'ది కేరళ స్టోరీ'కి ప్రారంభంలో ఎలాంటి ప్రచారం దక్కిందో 'బస్తర్' కి కూడా అలాంటి ప్రచారం దక్కింది. కానీ టికెట్ విండో వద్ద తేలిగ్గా చతికిలబడింది. ఇటీవలి ఇంటర్వ్యూలో అదా తన సినిమా ఫెయిల్యూర్ గురించి అసహనం వ్యక్తం చేసింది. ఒకసారి ప్రజలు సినిమా చూస్తే, దాని గురించి వారు అర్థం చేసుకుంటారు. కానీ నేను కేరళ స్టోరీ సమయంలో చెప్పినట్లు.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలు సినిమాను చూడాలా వద్దా అనేది వారే వ్యాఖ్యానిస్తారు. సినిమా చూసిన తర్వాత కామెంట్ చేయాలి... అలాగే సినిమా చూడకుండా కామెంట్లు చేసే వారిని కూడా మనం గౌరవించాలి.. ఎందుకంటే అది వారి ఇష్టం.. అంటూ పరిణతితో వ్యాఖ్యానించింది.
అదాతో పాటు 'బస్తర్: ది నక్సల్ స్టోరీ'లో ఇందిరా తివారీ, విజయ్ కృష్ణ, శిల్పా శుక్లా, యశ్‌పాల్ శర్మ, సుబ్రత్ దత్తా, రైమా సేన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాలో నక్సలైట్ (మావోయిస్ట్) తిరుగుబాటు ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ మద్దతుతో సిద్ధార్థ్ మల్హోత్రా, దిశా పటానీ, రాశి ఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ యోధాతో పోటీపడుతూ బస్తర్ విడుదలైంది. యోధాకు మంచి రివ్యూలు వచ్చాయి.