అదా శర్మ సంథింగ్ స్పెషల్ అంతే..!
ఐతే సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
By: Tupaki Desk | 11 May 2024 6:13 AM GMTదేశమంతా సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ కథానాయిక అదా శర్మ కెరీర్ అయిపోయింది అనుకున్న ప్రతి సారి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో సినిమాలు చేస్తుంది. ది కేరళ స్టోరీ తో అదా శర్మ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ లో మొదటి నుంచి రిస్క్ తీసుకోవడంలో ముందుంటుంది అదా శర్మ. బాలీవుడ్ లో 1920 సినిమాతో తొలి ప్రయత్నం చేసింది. అమ్మడు చేసిన ఈ సినిమా వల్లే ఆమెకు తెలుగులో పూరీ జగన్నాథ్ హార్ట్ ఎటాక్ ఆఫర్ వచ్చింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా శర్మ మెప్పించింది. ఐతే సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ కాకపోవడంతో అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు.
తొలి సినిమా 1920 తర్వాత కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో రణ విక్రం సినిమా చేసింది అదా శర్మ. అదా శర్మ ముందు జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలని అనుకంది. అది చేస్తున్న టైం లోనే అమ్మడికి నటన మీద ఆసక్తి పెరగడంతో సినిమాల్లోకి వచ్చింది. అదా శర్మ డ్యాన్స్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంది. ఆమె చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. జిమ్నాస్టిక్స్ లో కూడా ప్రావీణ్యం పొందింది. అందుకే యాక్షన్ సినిమాల్లో కూడా తాను నటించేందుకు రెడీ అంటుంది.
అదా శర్మ మంచి యానిమల్ లార్. స్ట్రీట్ డాగ్స్ ని దత్తత తీసుకోవాలని ఆమె చెబుతుంది. కెరీర్ పరంగా తనను కాదన్న వారే మళ్లీ అవకాశాలు ఇచ్చేలా చేసుకుంది అదా శర్మ. కోవిడ్ లాక్ డౌన్ టైం లో తన వెరైటీ వీడియోస్ తో అందరినీ అలరించిన అదా శర్మ. వరుస విజయాలతో తన సత్తా చాటుతుంది. అదా శర్మతో ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అంటున్నారు మేకర్స్.
తెలుగులో ఆమె చిన్న చిన్న పాత్రల్లో కూడా చేస్తూ వచ్చింది. అయితే కెరీర్ ముందుకు సాగాలంటే కొన్నిసార్లు వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని ఆమె అలా చేసిందని చెప్పొచ్చు. కేరళ స్టోరీ తర్వాత మాత్రం అదా తో సినిమా అంటే అంచనాలు భారీగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అమ్మడు రెండు సినిమాలతో బిజీగా ఉంది. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అదా శర్మకు ప్రత్యేకమైన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుందాం.