Begin typing your search above and press return to search.

తెల్లచీరలో దిమ్మ తిరిగేలా ఐష్ పాప

పొన్నియన్ సెల్వన్, మట్టికుస్తీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ ఐశ్వర్య లక్ష్మి

By:  Tupaki Desk   |   15 Sep 2023 5:12 AM GMT
తెల్లచీరలో దిమ్మ తిరిగేలా ఐష్ పాప
X

పొన్నియన్ సెల్వన్, మట్టికుస్తీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి చేరువ అయిన అందాల భామ ఐశ్వర్య లక్ష్మి. ఈ మలయాళీ బ్యూటీ 2017లో మాతృభాషలోనే హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. తరువాత విష్ణు యాక్షన్ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన గాడ్సే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత అమ్ము అనే తెలుగు సినిమాలో నవీన్ చంద్రకి జోడీగా నటించింది.


అయితే ఐశ్వర్య లక్ష్మికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన మూవీ అంటే పొన్నియన్ సెల్వన్ అని చెప్పాలి. ఈ చిత్రంలో జాలరి కన్య పాత్రలో ఈ బ్యూటీ నటించింది. అందం, అభినయంతో నటిగా వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టార్ ఇమేజ్ ని ఈ అమ్మడు సొంతం చేసుకుంటోంది. రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 3.1 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఈ అమ్మడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ కి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది. ఈమె పెట్టె ఫొటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. సినిమాలలో ఎక్కువగా ట్రెడిషనల్ క్యారెక్టర్స్ చేసిన ఐశ్వర్య లక్ష్మి బయట మాత్రం మోడ్రన్ టచ్ ఇస్తూ గ్లామర్ గా కనిపించడానికి ఇష్టపడుతుంది.

తాజాగా మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో వైట్ కలర్ శారీలో ఐశ్వర్య లక్ష్మి గ్లామర్ షో ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి హీట్ పెంచుతోంది. వైట్ కలర్ చీరలో రతీదేవిలా కనిపిస్తూ అందంతో మైకం పెంచేస్తోంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో ఏకంగా 2.79 లక్షల మంది ఈ ఫోటోలని లైక్ చేయడం విశేషం.

మలయాళంలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ఐశ్వర్య లక్ష్మి తెలుగులో మంచి బ్రేక్ కోసం వెయిట్ చేస్తోంది. మెజారిటీగా మల్లు బ్యూటీస్ ఆధిపత్యమే టాలీవుడ్ లో ఉంది. అలాగే ఈమె కూడా టాలీవుడ్ సరైన మూవీతో సక్సెస్ ట్రాక్ ఎక్కి స్టార్ హీరోయిన్ గా మారుతుందేమో చూడాలి.