ఆలియా ఎవరి కుమార్తెనో చెప్పిన నెటిజన్‌పై ఫైర్!
ఆలియా భట్ భారతదేశంలోనే గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకుంది. వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 13 Sep 2023 5:37 AM GMTపూజా భట్ తన కుమార్తె కాకపోతే తనను వివాహం చేసుకుని ఉండేవాడినని ప్రకటించాడు మహేష్ భట్. ఆ రోజుల్లో ఈ ప్రకటన మీడియాలో పెను దుమారాన్ని రేపింది. అప్పట్లోనే కుమార్తె పూజాతో పెదవి చుంబనం ఫోటోలు కూడా సంచలనం అయ్యాయి. ఇదంతా అగ్ర దర్శకనిర్మాత ప్రచార స్టంట్ అంటూ కొందరు కొట్టి పారేయగా, మహేష్ భట్ చేసిన పనికి తీవ్ర దుమారం చెలరేగింది.
దీనిపై చాలా సందర్భాల్లో మహేష్ భట్ కుమార్తె ఆలియా భట్ కి ప్రశ్నలు ఎదురయ్యాయి. గత కొంతకాలంగా ఆలియా .. పూజా భట్ కి జన్మించింది అంటూ మరోసారి ప్రచారం సాగుతోంది. ఈ పుకార్లపై పైజా భట్ స్పందించింది. ఆ కామెంట్లు చేసిన వారిని 'ఇడియాటిక్' అని కొట్టిపారేసింది. పూజా తన నిరాశను వ్యక్తం చేసింది. మన దేశంలో కుటుంబ సభ్యులు ఎవరితోనైనా సంబంధం గురించి మాట్లాడటం వింత. కాబట్టి ఇప్పుడు నేను దానిని ఎలా ప్రతిఘటించాలి? ఇలాంటి వాటికి స్పందించడంలో గౌరవం ఉందా? ఈ ప్రచారం అసంబద్ధం! అని ఖండించింది.
అలియా భట్ గతంలో కరణ్ జోహార్ చాట్ షోలో ఈ పుకారు గురించి ప్రస్తావించింది. మహేష్ భట్ - పూజా భట్ లకు జన్మించిన కుమార్తె ఆలియా అనేప్రచారాన్ని ఈ ఇంటర్వ్యూలో ప్రస్తావించింది. తన గురించి విన్న అత్యంత హాస్యాస్పదమైన పుకారు ఇది అని వ్యాఖ్యానించింది. నిజానికి పూజా భట్ .. మహేష్ భట్ - కిరణ్ భట్ దంపతుల కుమార్తె. అలియా భట్ ఆమె సోదరి. మహేష్ భట్ కి, అతడి రెండవ భార్య సోని రజ్దాన్ లకు జన్మించిన కుమార్తె ఆలియా. సోషల్ మీడియా యుగంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు సెలబ్రిటీలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. బంధాలు అనుబంధాలపై తప్పుడు ప్రచారం శ్రేయస్కరం కానిది.
ఆలియా భట్ భారతదేశంలోనే గొప్ప నటీమణిగా పేరు తెచ్చుకుంది. వరుసగా భారీ పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల స్టార్ హీరో రణబీర్ ని పెళ్లాడి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆలియా. రాహా తన కుమార్తె. భర్తతో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర పాన్ ఇండియా హిట్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి పార్ట్ 2 తెరకెక్కనుంది.