Begin typing your search above and press return to search.

వోగ్ పై అలియా భ‌ట్ ఒంపుసొంపులు!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ ఫ్యాష‌న్ అండ్ స్టైలింగ్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌రిలో డిఫ‌రెంట్ గా ఫోక‌స్ అవ్వాల‌ని చూస్తుంది

By:  Tupaki Desk   |   9 Oct 2023 9:27 AM GMT
వోగ్ పై అలియా భ‌ట్ ఒంపుసొంపులు!
X

బాలీవుడ్ యంగ్ బ్యూటీ అలియాభ‌ట్ ఫ్యాష‌న్ అండ్ స్టైలింగ్ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అంద‌రిలో డిఫ‌రెంట్ గా ఫోక‌స్ అవ్వాల‌ని చూస్తుంది. త‌న‌లో స‌మ్ థింగ్ స్పెష‌ల్ ఉంద‌నేలా అమ్మ‌డి ఎంపిక‌లు క‌నిపిస్తుంటాయి. ఆల్ట్రామోడ్ర‌న్ బ్యూటీగా డీజైన‌ర్ దుస్తుల్లో అలియా మురిపాల గురించి తెలిసిందే. సంద‌ర్భాన్ని బ‌ట్టి అమ్మ‌డు త‌న‌ని తాను సునాయాసంగా మౌల్డ్ చేసుకుంటుంది.


గ్లామ‌ర్ గా క‌నిపించాలి అన్నా! అదే తీరున హైలైట్ అవుతుంది. బ్యూటీ కా బాప్ అనిపించేలా అందాల ఆర‌బోస్తుంది. చిట్టిపొట్టి దుస్తుల్లో...స్విమ్ షూట్..టూపీస్ అందాల్లో అగ్గిరాజేసిన సంద‌ర్భాలెన్నో. ఇక ప్ర‌త్యేక ఫోటో షూట్ల‌లో సొగ‌స‌రి ఎప్ప‌టిక‌ప్పుడు న్యూలుక్ తోనూ ఆక‌ట్టుకుంటుంది. అందులో త‌న‌కంటూ ఓ బ్రాండ్ ఐడెంటిటీ ఉంద‌ని చాటి చెబుతుంది. తాజాగా అలియా భ‌ట్ ఓగ్ మ్యాగ‌జైన్ క‌వ‌రేజీ పేజీ కోసం ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

బ్లాక్ అండ్ వైట్ డిజైన్డ్ దుస్తుల్లో ఆక‌ట్టుకుంటుంది. న‌డుము నుంచి కాలిపాదాల్ని క‌వ‌ర్ చేస్తూ డ్రెస్ ని మ్యాచ్ చేసేలా నెట్ డిజైన్... కాళ్ల‌కి ధ‌రించిన బ‌ల‌మైన హైహీల్స్ అమ్మ‌డు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. బ్యాక్ గ్రౌండ్ లొకేష‌న్... అలియా భ‌ట్ స్టైలిష్ భంగిమ వావ్ అనిపిస్తున్నాయి. వోగ్ పై అలియా ఒంపుసొంపుల‌కు కుర్ర‌కారు ఫిదా అవ్వ‌డం ఖాయం. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ మ‌ద్య కాలంలో అలియా పాల్గొన్న క‌వ‌ర్ పేజీ షూట్ కూడా ఇదే. ప్ర‌సవం త‌ర్వాత ఇన్ స్టాలో వ్య‌క్తిగ‌త ఫోటోలు షేర్ చేసింది తప్ప! ప్ర‌మోష‌న‌ల్ ప‌ర్ప‌స్ లో అమ్మ‌డు పెద్ద‌గా క‌నిపించ‌లేదు. తాజాగా మ్యాగ‌జైన్ ప్ర‌మోష‌న్ తో ముందుకు రావ‌డం ఇంట్రెస్టింగ్. ఇక న‌టిగా అలియాభ‌ట్ స్పీడ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. వ‌రుస విజ‌యాల‌తో..అవ‌కాశాల‌తో దూసుకుపోతుంది. ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. త్వ‌ర‌లో హాలీవుడ్ సినిమాతోనూ మెప్పించ‌నుంది.