Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బీచ్ లో అందాల శిల్పం

తెలుగు ప్రేక్షకుల ముందుకు 2018లో మనసుకు నచ్చింది సినిమాతో వచ్చిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌

By:  Tupaki Desk   |   23 Jan 2024 12:53 PM IST
పిక్ టాక్ : బీచ్ లో అందాల శిల్పం
X

తెలుగు ప్రేక్షకుల ముందుకు 2018లో మనసుకు నచ్చింది సినిమాతో వచ్చిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అమైరా 2013 లో హిందీ సినిమా ఇసాక్ లో నటించడం ద్వారా సినీ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.


హిందీ, తెలుగు మరియు తమిళ భాషల సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి సక్సెస్ లు దక్కలేదు. సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్ చేసే ఫోటోలు మరియు వీడియోల కారణంగా నెట్టింట ఎప్పుడూ కూడా వైరల్‌ అవుతూ ఉంటుంది.

తాజాగా మరోసారి అమైరా ఆసక్తికర ఫోటోను షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. బీచ్ లో లాంగ్ షాట్ లో అందాల శిల్పం మాదిరి ఫోటోకు ఫోజ్ ఇచ్చింది. గోవా బీచ్ అందంను తలదన్నే విధంగా అమైరా దస్తూర్‌ శిల్పం వంటి ఫోజ్ తో మతి పోగొట్టింది.

సూర్యాస్తమయం సమయం లో అందాల ఆరబోత చేస్తు అదరగొట్టే విధంగా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌ ఆకట్టుకుంది. అందమైన ఈ అమ్మడు ఆకట్టుకునే రేంజ్ లో బీచ్ లో అందాల శిల్పం మాదిరిగా ఫోజ్ ఇవ్వడంతో నెట్టింట వైరల్‌ అవుతోంది.