Begin typing your search above and press return to search.

స్టార్ కిడ్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం స్కైలోకి

జెడ్డాలో జ‌రుగుతున్న‌ ప్రతిష్టాత్మక రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ వర్ధమాన తార అనన్య పాండే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు

By:  Tupaki Desk   |   3 Dec 2023 12:30 AM GMT
స్టార్ కిడ్ బ్రాండ్ వ్యాల్యూ అమాంతం స్కైలోకి
X

జెడ్డాలో జ‌రుగుతున్న‌ ప్రతిష్టాత్మక రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ వర్ధమాన తార అనన్య పాండే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సినిమాల్లోని వైవిధ్యాన్ని ఆవిష్క‌రించే అరుదైన పండుగ ఇది. ఈ వేడుక‌ల‌కు అన‌న్య పాండే 'వానిటీ ఫెయిర్ ఉమెన్ ఇన్ సినిమా ఫోరమ్‌'కు హాజరయ్యారు. అవ‌కాశం క‌ల్పించినందుకు కృతజ్ఞతను తెలియజేసారు అన‌న్య‌. ''రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి గౌరవనీయమైన ఉత్సవంలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను.. ఈ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణం'' అని అన్నారు. అందాల క‌థానాయిక‌ భాగస్వామ్యం క‌చ్చితంగా భారతీయ సినిమాపై పెరుగుతున్న ప్రపంచ ప్రభావాన్ని పరిశ్రమలోని ప్రతిభను హైలైట్ చేస్తుంది.


రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మూడవ ఎడిషన్ వేడుక‌లు కొద్దిరోజులుగా వైభ‌వంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం చలనచిత్ర నిర్మాణ ప్రపంచంలోని అంతర్జాతీయ ప్రాంతీయ ప్రతిభావంతుల నుండి ఉత్తమమైన షోల‌ను ప్ర‌ద‌ర్శించేందుకు చిత్రనిర్మాతలు, సినీ ప్రేమికులు, సాంకేతిక‌ నిపుణులను ఒకచోట చేర్చుతుంది.

ఇటీవల అనన్య పాండే త‌న బ్రాండ్ వ్యాల్యూను అమాంతం పెంచుకుంటోంది. న్యూయార్క్ నగరంలో స్వరోవ్స్కీ ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభోత్సవానికి అన‌న్య హాజ‌రైంది. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సేవ‌లందిస్తోంది. సోషల్ మీడియాలో సెరెనా విలియమ్స్, ఫ్రీదా పింటో, కిమ్ కర్దాషియాన్ స‌హా అనేక మంది అంతర్జాతీయ ప్రముఖులతో క‌లిసి ఉన్న ఫోటోల‌ను అన‌న్య‌ పోస్ట్ చేసింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. అనన్య పాండే చివరిసారిగా ఆయుష్మాన్ ఖురానాతో కలిసి 'డ్రీమ్ గర్ల్ 2'లో కనిపించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. తదుపరి 'ఖో గయే హమ్ కహాన్‌'లో ఆదర్శ్ గౌరవ్ - సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి నటించనుంది. అర్జున్ వరైన్ సింగ్ తెర‌కెక్కిస్తున్న‌ ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 26న నెట్‌ఫ్లిక్స్ లో విడుదలకు సిద్ధంగా ఉంది. ఖో గయే హమ్ కహాన్‌తో క‌ల్తీ లేని స్నేహం నేప‌థ్యంలో రూపొందించిన సినిమా. ఇది సోష‌ల్ మీడియాల్లో ప‌రిచ‌య‌మైన‌ 20 ఏళ్ల లోపు ఉన్న‌ ముగ్గురు స్నేహితుల గురించిన క‌థాంశ‌మిది. కమింగ్-ఆఫ్-డిజిటల్-యుగం కథగా చెబుతున్నారు.