Begin typing your search above and press return to search.

మన్మథుడు అన్షు.. చీరలో సెగలు పుట్టించేలా..

అన్షు అంబానీ.. మన్మథుడు సినిమాలో మహేశ్వరి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది

By:  Tupaki Desk   |   11 March 2024 1:38 PM GMT
మన్మథుడు అన్షు.. చీరలో సెగలు పుట్టించేలా..
X

అన్షు అంబానీ.. మన్మథుడు సినిమాలో మహేశ్వరి పాత్రలో నటించి ఒక్కసారిగా మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్ కు హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమాలోనే స్టార్ హీరో నాగార్జునతో నటించే ఛాన్స్ కొట్టేసింది. తన బ్యూటీనెస్, యాక్టింగ్, లుక్స్ తో తెలుగు సినీ ప్రేక్షకులను కట్టి పడేసింది. లంగాఓణీలో ఈ అమ్మడి అందాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు.

ఆ తర్వాత ప్రభాస్ తో రాఘవేంద్ర మూవీ చేసింది. కానీ ఆ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. అయితే టాలీవుడ్ లో అన్షు చేసింది రెండే రెండు సినిమాలు.. కానీ క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో కొట్టేసింది. చివరగా అన్షు నటించిన సినిమా జై. ఈ కోలీవుడ్ మూవీ తర్వాత అన్షు.. ఒక్క సినిమా కూడా చేయలేదు. మూవీల కోసం లండన్ నుంచి ఇండియా వచ్చిన అన్షు.. మళ్లీ అక్కడికే వెళ్లిపోయి మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది.

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో లండన్ కు చెందిన సచిన్ సగ్గర్ ను పెళ్లి చేసుకుంది. అయితే ఆమె ఓ ఫ్యాషన్ డిజైనర్ కావడంతో మ్యారేజ్ అయిన తర్వాత లండన్‌ లో గార్మెంట్స్ బిజినెస్‌ స్టార్ట్ చేసింది. ఇక సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియా మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. సింగిల్ తోపాటు ఫ్యామిలీ పిక్స్ షేర్ చేస్తుంటోంది. ఇటీవల మన్మధుడు వీడియోను రీక్రియేట్ చేసి షేర్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు 20 ఏళ్ల తర్వాత కూడా అన్షు అంతే అందంగా ఉందంటూ రీషేర్ చేశారు.

వైట్ కలర్ ఫ్లోరల్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో దిగిన పిక్స్ ను తాజాగా షేర్ చేసింది అన్షు. డీసెంట్ శారీలో అందాలు ఆరబోసింది. నడుము వొంపులతో మైమరచి పోయేలా చేస్తోంది. అందానికి ఇమేజ్ గా కనిపిస్తోంది. లుక్స్ తో ఫిదా చేస్తోంది. ప్రస్తుతం అన్షు కొత్త పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జస్ట్ లుకింగ్ ఏ వావ్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మళ్లీ తెలుగు సినిమాలు చేయండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయితే ఇటీవల మన్మథుడు మూవీ రీ రిలీజ్ టైమ్ లోనే ఇంటర్వ్యూతో ఆడియన్స్ ముందుకు వచ్చింది అన్షు. చాలా ఏళ్ల తర్వాత ఆమెను చూసి టాలీవుడ్ మూవీ లవర్స్ సంబరపడిపోయారు. ఇక తన సూపర్ హిట్ మూవీ రీరిలీజ్ టైమ్ లోనే రీఎంట్రీ బెస్ట్ అనుకుందేమో గానీ.. ఆ ఇంటర్వ్యూలో మళ్లీ వచ్చాను అని తెలిపింది. టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెప్పింది. మరి అన్షు.. సెకండ్ ఇన్నింగ్స్ లో ఎలాంటి రోల్స్ ఎంచుకుంటుందో చూడాలి.