ఆ హీరోని ప్రేమించలేదు.. అంత చనువు లేదు! అను ఇమ్మాన్యుయేల్
తాజాగా అను ఇమ్మాన్యూయేల్ కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కున్నట్లు "జపాన్" సినిమా ప్రమోషన్ లో రివీల్ చేసింది
By: Tupaki Desk | 28 Aug 2023 8:19 AM GMT"మీటూ ఉద్యమం"లో భాగంగా లైంగికంగా బాధింపబడ్డ వారంతా! ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లో భాగంగా లైంగిక దోపిడిపై ఎంతో మంది నటీమణులు విస్తుపో యే వాస్తవాలు బయట పెట్టారు. టాలీవుడ్..కోలీవుడ్..బాలీవుడ్ భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లో నూ దొపిడికి గురైన వారంతా తమ బాధని చెప్పుకునే ప్రయత్నం చేసారు. ఇప్పటికీ ఆ కాక చల్లారలేదు. నిత్యం ఎవరో ఒకరు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు చెప్పుకొస్తున్నారు. లైంగిక వేధింపుల గురించి రోజుకో నటి తెరపైకి వస్తున్నారు.
తాజాగా అను ఇమ్మాన్యూయేల్ కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కున్నట్లు "జపాన్" సినిమా ప్రమోషన్ లో రివీల్ చేసింది. "చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నాకు కూడా అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఈ సమస్యను కుటుంబ సభ్యుల సహకారంతో మనం ఎదుర్కోవాలి. ఇలాంటి ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో చెప్పాలి. వాళ్ళ అండ తీసుకోవాలి. ఆ సమయంలో ఒంటరిగా తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో తెలియదు. అయోమయానికి గురవుతాం. అందుకే నేను విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్పాను. ఆ సమస్య నుంచి బయట పడటం సులభం అయింది" అన్నారు.
అలాగే ఆ మధ్య టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందంటూ మీడియా కథనాలు వెడెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమ్మడు తెలుగులో సినిమాలు చేయకపోవడంతో వాటిపై స్పందించే అవసరం రాలేదు. తాజాగా వాటిపైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. "ఈ విషయం నాకు అమ్మ ద్వారా తెలిసింది. ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతారు. ఇలాంటి రూమర్లు వస్తున్నాయేంటి? అని బాధపడింది.
నిజానికి ఆహీరోని లాంచింగ్ డే రోజున మాత్రమే కలిసాను. అప్పుడే స్నేహం మొదలైంది. అంతకు మించి ఇద్దరి మధ్య ఎలాంటి బంధం లేదు. ప్రేమించే చనువు ఆకర్షణ లేవు. పాత్రలు పండాలని సినిమాలో కాస్త రియలిస్టిక్ గా నటించామంతే. ఆ మాత్రానికే ఏదో ఉందని వార్తలొచ్చాయి. అంతకు ముందే ఆ కుటుంబానికి చెందిన హీరోతోనూ ఓసినిమా చేసాను" అని అంది.