Begin typing your search above and press return to search.

ప్రెగ్నెన్సీ వార్తలు... హీరోయిన్‌ స్పందన ఇలా

అనుష్క గర్భవతి అవ్వడం వల్లే మీడియా కంట పడకుండా తిరుగుతున్నారు అంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 12:46 PM GMT
ప్రెగ్నెన్సీ వార్తలు... హీరోయిన్‌ స్పందన ఇలా
X

కొన్ని రోజుల క్రితం ముంబయిలోని ఒక ఆసుపత్రి వద్ద విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు కనిపించారు అని.. ఆ సమయంలో అనుష్క లావుగా కనిపించడంతో పాటు ఆమె ఫోటోగ్రాఫర్లకు దూరంగా వెళ్లిందనే ప్రచారం జరిగింది. అనుష్క గర్భవతి అవ్వడం వల్లే మీడియా కంట పడకుండా తిరుగుతున్నారు అంటూ చాలా మంది ప్రచారం చేస్తున్నారు.

జాతీయ మీడియాలో కూడా అవే వార్తలు వస్తున్న నేపథ్యం లో విరుష్క దంపతులు రెండో సారి తల్లిదండ్రులు అవ్వబోతున్నారు అనే ప్రచారంకు బలం చేకూరినట్లు అయింది. విరాట్ కానీ, అనుష్క కానీ అతి త్వరలోనే ఈ విషయమై అధికారికంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో.. అనుష్క పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

ఒక వైపు ప్రెగ్నెన్సీ వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్న సమయంలో అనుష్క శర్మ సోషల్‌ మీడియా ద్వారా... అభిప్రాయాలు అనేవి వ్యక్తిగతం నుంచి వస్తాయి అని మీరు అర్థం చేసుకున్నప్పుడు, వాటి జడ్జిమెంట్‌ ఎలా ఉంటుందో కూడా మీకు అర్థం అవ్వాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా పోస్ట్‌ పెట్టింది.

అనుష్క శర్మ పోస్ట్‌ గురించి రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఆమె ప్రెగ్నెన్సీ వార్తలను పుకార్లు అంటూ కొట్టి పారేయకుండా ఇలాంటి పోస్ట్‌ పెట్టడం వెనుక ఉద్దేశ్యం ఏంటో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరి కొందరు ఇంతకు అనుష్క ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

2017 లో పెళ్లి చేసుకున్న విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మలు ఇప్పటికే ఒక పాపకు జన్మనిచ్చారు. పాపతో ప్రస్తుతం లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న వీరు రెండో బిడ్డ కోసం ఎదురు చూడటం లో తప్పేంటి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి విరుష్క దంపతుల అభిప్రాయం ఏంటో మరి...!