Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీ స్నేహాల‌పై కంగ‌న కామెంట్‌కి చెక్

ఓ మీడియా ఈవెంట్లో మాట్లాడిన సీనియ‌ర్ న‌టీమ‌ణి ఆశా పరేఖ్, కంగనా వ్యాఖ్యలతో విభేధించారు.

By:  Tupaki Desk   |   12 Oct 2023 2:30 AM GMT
ఇండ‌స్ట్రీ స్నేహాల‌పై కంగ‌న కామెంట్‌కి చెక్
X

బాలీవుడ్‌లో నిజమైన స్నేహాలు లేవ‌ని కంగనా రనౌత్ చేసిన ఆరోపణలపై వెట‌ర‌న్ న‌టి ఆశా పరేఖ్ ఇటీవల తన ఆలోచనలను షేర్ చేసారు. ఓ మీడియా ఈవెంట్లో మాట్లాడిన సీనియ‌ర్ న‌టీమ‌ణి ఆశా పరేఖ్, కంగనా వ్యాఖ్యలతో విభేధించారు. తన సమకాలీనులైన వహీదా రెహ్మాన్ -హెలెన్‌లతో బలమైన శాశ్వతమైన స్నేహాన్ని కొనసాగించినట్లు తెలిపారు.

నాటి రోజుల్లోలానే బలమైన స్నేహాలు ఈనాటికీ బాలీవుడ్‌లో ఉన్నాయా? అని ప్ర‌శ్నించ‌గా, ఆశా పరేఖ్ పరిశ్రమలో నిజమైన స్నేహాలు ఎందుకు లేవని కంగన భావిస్తున్నారో ఆరా తీయమని ప్రేక్షకులను ప్రోత్సహించారు. సన్నిహిత బంధాలను ఏర్పరచుకోవాలా వద్దా అనేది వ్యక్తుల వ్యక్తిగత ఎంపిక అని ప్రముఖ నటి ఆశా నొక్కిచెప్పారు. కంగనాతో తనకున్న సానుకూల అనుభవాన్ని ఆశా ప‌రేఖ్‌ ప్రస్తావించారు. కంగ‌న‌ ఎల్లప్పుడూ దయతో మ‌హిళ‌ల‌కు మద్దతుగా ఉంటుందని పేర్కొంది.

న‌టి ఆశా ప‌రేఖ్ తరచుగా వెకేష‌న్స్ ని ఇష్ట‌ప‌డ‌తారు. అలాగే పరిశ్రమలోని తన తోటి నటీమణులతో కలిసి సమావేశాల‌ను నిర్వహిస్తుంటారు. దీనివ‌ల్ల స‌మ‌కాలీనులంతా ఒకే వేదిక‌పైకి రావ‌డం ద్వారా ఒకరినొకరు క‌లుసుకుని మంచి స్నేహ‌బంధం ఏర్ప‌రుచుకోవ‌డానికి స‌హ‌క‌రిస్తుంది. కెరీర్ ప‌రంగా పోటీ ఉన్నా, దానిని మ‌ర‌చి స్నేహితులు అవ్వ‌డం అన్న‌ది ఆమెకు ఇష్టమని చెబుతారు.

మరోవైపు కంగనా తన తోటి బాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో చేదు-తీపి అనుభవాల‌ను క‌లిగి ఉంది. హీరోలు, నటీమణులు లేదా ద‌ర్శ‌క‌నిర్మాతలు ఎవ‌రైనా కావచ్చు. కంగ‌న అలాంటి వారిపై తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తపరచడం ప్ర‌తిసారీ వివాదాస్ప‌ద‌మే అయింది. క్వీన్ తాను మాట్లాడాల‌నుకున్న ప్ర‌తిదీ ఓపెన్ గా మాట్లాడేస్తుంది. రెగ్యుల‌ర్ గా బాలీవుడ్‌లో పక్షపాతం- సోద‌ర భావాన్ని నిల‌దీస్తుంది.

కంగనలో దాప‌రికం లేని స్వభావం పరిశ్రమలోని వ్యక్తులు ఆమెతో లోతైన సంబంధానికి బదులుగా స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించడానికి ఒక కారణం కావచ్చు. ఏది ఏమైనప్పటికీ కంగనా అంద‌రిలో ఒక‌రిగా ఉండాలనే ఒత్తిడికి తలొగ్గకుండా అత్యంత పోటీతత్వ పరిశ్రమలో తనకంటూ ఒక స్థాయి ఉంద‌ని నిరూపించ‌డం గొప్ప విషయం.

వృత్తిపరంగా చూస్తే.. కంగనా రనౌత్ తన త‌దుప‌రి చిత్రం తేజస్ విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 27న థియేటర్లలోకి రానుంది. సర్వేష్ మేవారా రచించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కంగనా ఎయిర్ ఫోర్స్ పైలట్ పాత్రను పోషించింది.