Begin typing your search above and press return to search.

స్టార్ డాట‌ర్ సూప‌ర్ క్లిక్!

సునీల్ శెట్టి వార‌సురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతియాశెట్టి ఇండ‌స్ట్రీలో మాత్రం నిల‌దొక్కు కోలేక పోయింది

By:  Tupaki Desk   |   9 Dec 2023 6:26 AM
స్టార్ డాట‌ర్ సూప‌ర్ క్లిక్!
X

సునీల్ శెట్టి వార‌సురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అతియాశెట్టి ఇండ‌స్ట్రీలో మాత్రం నిల‌దొక్కు కోలేక పోయింది. అమ్మ‌డు అంద‌..అభిన‌యం గ‌ల నాయికే అయినా ఎందుక‌నో ప‌రిశ్ర‌మలో మాత్రం రాణిం చలేక పోయింది. ఈ విష‌యంలో డాట‌ర్ ని కూడా డాడ్ తోనే పొల్చాలేమో అనిపిస్తుంది. సునీల్ శెట్టి కూడా న‌టు డిగా మంచిపేరు సంపాదించారు. ఎన్నో క్లాసిక్ హిట్లు కెరీర్ లో ఉన్నాయి. కానీ ఒకానొక ద‌శ‌లో సునీల్ శెట్టి కూడా వెనుక‌బ‌డ్డారు.


అప్ప‌టి నుంచి హీరో కోలుకోలేక‌పోయారు. కొన్ని సినిమాలైతే చేసాడు గానీ...మున‌ప‌టి అంతా వేగాన్ని అందుకోలేక‌పోయారు. కుమార్తె అంత‌వ‌ర‌కూ రాలేద‌న‌కొండి. అమ్మ‌డు ముఖానికి మ్యాక‌ప్ వేసుకుని నాలుగేళ్లు అవుతుంది. చివ‌రిగా 2019 లో "మిట్చూర్ చాక‌న్ చూర్" అనే చిత్రంలో న‌టించింది. ఆ త‌ర్వాత కె.ఎల్ రాహుల్ తో ప్రేమ‌లో ప‌డ‌టంతో ప్రోఫెష‌న‌ల్ కెరీర్ ని పూర్తిగా లైట్ తీసుకుంది.


గ‌తేడాదే రాహుల్ ని వివాహం చేసుకుని పూర్తిగా ఫ్యామిలీ లైఫ్ కే అంకిత‌మైంది. అయితే అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో క్రేజ్ ని మాత్రం అలాగే కొన‌సాగిస్తుంది. అందులో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో యువ‌త దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది. తాజాగా మ‌రో కొత్త ఫోటోతో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. ఇదిగో ఇక్క డిలా స్క‌ర్ట్ పై గ్రీన్ క‌ల‌ర్ మ్యాచింగ్ టీష‌ర్ట్ లో ముస్తాబైంది. నెక్ పై నెక్లెస్ అమ్మ‌డిని మ‌రింత అందంగా తీర్చిదిద్దింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు అతియా అందాన్ని అంతే ఆస్వాది స్తున్నారు. త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అతియాలో ఈ ర‌క‌మైన ఉత్సాహం చూస్తుంటే సినిమాల‌పై అమ్మ‌డికింకా ఆస‌క్తి ఉన్న‌ట్లే క‌నిపిస్తుంది. మ‌రి ఈ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలేవైనా కొత్త అవ‌కాశాలు తెచ్చిపెడ‌తాయా? అన్న‌ది చూడాలి.