Begin typing your search above and press return to search.

డ‌బ్బులిచ్చి న‌ర‌కం కొని తెచ్చుకోవాలా?

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో పోస్ట్ చేసింది. 'అమ్మాయిలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? డ‌బ్బులిచ్చి మ‌రీ భ‌ర్త‌ను కొని తెచ్చుకోవాలా? అవ‌స‌ర‌మే లేదు.

By:  Tupaki Desk   |   19 July 2024 11:30 PM GMT
డ‌బ్బులిచ్చి న‌ర‌కం కొని తెచ్చుకోవాలా?
X

మ‌ల‌యాళం న‌టి భామ భ‌ర్త‌తో విడిపోయిందంటూ కొన్ని రోజులుగా నెట్టింట ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. భ‌ర్త‌తో క‌లిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయ‌డం, సింగిల్ మ‌ద‌ర్ అని ప్ర‌క‌టించుకోవ‌డం వంటి స‌న్నివేశాల‌తో విష‌యం అర్ద‌మైంది. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో పోస్ట్ చేసింది. 'అమ్మాయిలు పెళ్లి ఎందుకు చేసుకోవాలి? డ‌బ్బులిచ్చి మ‌రీ భ‌ర్త‌ను కొని తెచ్చుకోవాలా? అవ‌స‌ర‌మే లేదు.

పెళ్లి చేసుకున్నాక అదే భ‌ర్త మ‌న‌ల్ని వ‌దిలేస్తే ప‌రిస్థితి ఏంటి? మ‌న డ‌బ్బుతో వారు సుఖంగా బ్ర‌తుకుతారు. కానీ మ‌నం మాత్రం ఒంట‌రిగా జీవిస్తాం. మ‌న జీవితంలో కి వ‌చ్చిన వారిని మ‌న‌కు త‌గ్గ‌ట్టు మ‌లుచుకునే లోపు జీవితం అయిపోతుంది. ఆ త‌ర్వాత చేసేదేం ఉండ‌దు' అని రాసుకొచ్చింది. భామ కి అర్జున్ అనే వ్య‌క్తితో 2020లో వివాహ‌మైంది. వివాహం త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది.

అవ‌కాశాలు వ‌చ్చినా కుటుంబ జీవితానికే అంకిత‌మని సినిమాలు చేయ‌లేదు. ఈ దంప‌తుల‌కు గౌరీ అనే కుమార్తె కూడా ఉంది. ఇద్ద‌రి మ‌ధ్య విబేధాలు రావ‌డంతో దూర‌మయ్యారు. కుమార్తె త‌ల్లి వ‌ద్ద‌నే ఉంది. ఈ అమ్మ‌డు మ‌ల‌యాళం, క‌న్న‌డ సినిమాలు చేసింది. మ‌రి తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో మ‌ళ్లీ కంబ్యాక్ అవుతుందా? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం పెళ్లికాని భామ‌ల‌కంటే పెళ్లై..పిల్ల‌లు ఉన్న హీరోయిన్ల‌కు డిమాండ్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది.

తెలుగులో అలాంటి వాళ్ల‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ఒక‌ప్పుడు ఈ ట్రెండ్ బాలీవుడ్ లో ఎక్కువ‌గా క‌నిపించేది. ఈ మ‌ధ్య తెలుగులో ఎక్కువైంది. కాజ‌ల్ అగ‌ర్వాల్, స‌మంత లాంటి వారు అలా సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కాబ‌ట్టి భామ కూడా తెలుగులో ఓ ప్ర‌య‌త్నం చేస్తే బాగుంటుందనే టాక్ వినిపిస్తుంది.