ఆ హీరోయిన్ ఇమేజ్ రూమ్ కి వెళ్లేంతగా దిగజారిందా?
మీలాంటి అందమైన నటిని అలా రూమ్ కివెళ్లే సన్నివేశంలో చూడలేక ఇబ్బంది పడాల్సి వచ్చిందని అంటున్నారు
By: Tupaki Desk | 29 Aug 2023 11:39 AM GMTఇటీవలే ఓ స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయింది. వరుస వైఫల్యాల తర్వాత విజయం సాధించిన సినిమా ఇది. సౌత్ లో అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లని రాబట్టింది. దీంతో హీరో సహా యూనిట్ ఆనందానికి అవదుల్లేవ్. ఇలా అంతా సంతోషంగా ఉన్నా..ఆ హీరోయిన్ అభిమానులు మాత్రం ఓ విషయంలో హర్ట్ అవుతున్నారు. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్ ఐటం పాటలో నటించింది.
ఆ పాట మంచి హిట్ అయింది. అమ్మడి సెకెండ్ ఇన్నింగ్స్ లోకూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తుంది. నటిగా అవకాశం వచ్చినా? ఐటం భామగా ఛాన్స్ వచ్చినా ? రెండు కలిపి వచ్చినా విడిచి పెట్టడం లేదు. ఎంతైనా రావడం రావడమే కాదా? కాళ్ల దగ్గరకి వచ్చిన అవకాశాన్ని కాళ్లదన్నకూడదని కమిట్ అవుతుంది. అలాగే మార్కెట్ లో బ్రాండింగ్స్ కూబా బాగానే చేస్తుంది. ఇలా సంపాదన పరంగా బాగానే ఉంది.
అయితే ఆ స్టార్ హీరో సినిమాలో ఐటం పాటవరకూ బాగానే ఉంది. కానీ చివర్లో ముక్కు..ముఖం తెలియని ఓ నటుడి కోసం అతని రూమ్ కి ఆ హీరోయిన్ వెళ్లాలని చేసిన ప్రయత్నంపై మాత్రం అభిమానులు గుసాయిస్తున్నారు. అంత పేరున్న నటితో అలాంటి సీన్ ఎలా చేయించారని ఆమె అభిమానులు అడుగుతున్నారు. దర్శకుడు ఏది చెబితే అది చేసేస్తే? ఎలా ఓసారి ఆలోచించుకోవద్దు అంటూ ఆ హీరోయిన్ కి సలహాలు పాస్ చేస్తున్నారు.
మీలాంటి అందమైన నటిని అలా రూమ్ కివెళ్లే సన్నివేశంలో చూడలేక ఇబ్బంది పడాల్సి వచ్చిందని అంటున్నారు. ఆ హీరోయిన్ లేడీస్ లోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా కూడా అవకాశాల అందుకుంటుంది. పూర్తిగా జీరో అయిన నటి కూడా కాదు. అలాంటి నటిని హోటల్ గది బయట లోపలకి వెళ్లాలని ప్రయత్నించి విఫలమవ్వడం..తొంగి చూస్తారని ఆమె బయపడే సన్నివేశాలు అభిమానుల్ని బాధించాయి. మళ్లీ ఎప్పుడు ఇలాంటి సన్నివేశాల్లో నటించొద్దు మేడం అంటున్నారు. ఇలాంటి సన్నివేశాలు ఆమె ఇమేజ్ ని కూడా డ్యామేజ్ చేసేవే.