Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: అంబానీ స్కూల్‌లో రిచ్ కిడ్స్

ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ప‌లు అగ్ర సినీకుటుంబాల నుంచి కిడ్స్ అంతా ఇదే స్కూల్ లో చదువుకుని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు.

By:  Tupaki Desk   |   25 May 2024 1:30 AM GMT
ట్రెండీ స్టోరి: అంబానీ స్కూల్‌లో రిచ్ కిడ్స్
X

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో నీతా అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాముఖ్య‌త ఏమిటో తెలిసిందే. ఈ స్కూల్‌లోనే సెల‌బ్రిటీ కిడ్స్ చ‌దువుకునేందుకు ఆస‌క్తిగా ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన ప‌లు అగ్ర సినీకుటుంబాల నుంచి కిడ్స్ అంతా ఇదే స్కూల్ లో చదువుకుని ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. చాలామంది స్టార్లుగాను సినీరంగంలో కొన‌సాగుతున్నారు.

కింగ్ ఖాన్ షారూఖ్ కుమార్తె సుహానా ఖాన్, అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి న‌ట‌వార‌సురాళ్లు జాన్వీ కపూర్, ఖుషీ క‌పూర్, చుంకీపాండే వార‌సురాలు అనన్య పాండే, సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్, అమీర్ ఖాన్ వార‌సుడు జునైద్ ఖాన్, ఇంకా చాలా మంది స్టార్ కిడ్స్ ఇదే స్కూల్ లో చ‌దువుకున్నారు. ప్రస్తుత సినీ తారలుగా ఎదిగిన కొంద‌రు అంబానీ స్కూల్ లో పూర్వ విద్యార్థులు. ఈ విద్యా సంస్థ భారతదేశంలోని అగ్ర పాఠశాలల్లో ఒకటి. ఇది కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (CISCE), ఇంటర్నేషనల్ బాకలారియేట్ డిప్లొమా ప్రోగ్రామ్ (IBDP), కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్స్ (CAIE)కి అనుబంధంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాల. అలాగే పాఠశాల కేంబ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ప్రైమరీ ప్రోగ్రామ్ (CIPP)లో సభ్యత్వం క‌లిగి ఉంది.

ఈ పాఠశాలను నీతా ముఖేష్ అంబానీచే `డేర్ టు డ్రీం, లెర్న్ టు ఎక్సెల్` అనే నినాదంతో 2003లో స్థాపించారు. ఈ నినాదానికి కట్టుబడి అంబానీ పాఠశాల తన విద్యార్థులకు కెరీర్ ఎదుగుద‌ల కోసం పునాదిని వేస్తోంది. ఎంచుకున్న రంగాలలో ఎగరడానికి వీలు కల్పించే రెక్క‌ల‌ను ఇస్తుంది ఈ స్కూల్. ధీరూభాయ్ అంబానీ స్కూల్ పూర్వ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్త‌మ స్థానంలో ఉన్నారు.

1. గౌరీ ఖాన్ - షారుక్ ఖాన్ కుమారుడు: అబ్రామ్


బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ - గౌరీ ఖాన్ దంప‌తుల చిన్న‌బిడ్డ‌ అబ్రామ్ ఖాన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యార్థి. తన పెద్ద తోబుట్టువులు, సుహానా ఖాన్, ఆర్యన్ ఖాన్‌ల అడుగుజాడలను అనుసరించి, అదే సంస్థలో ప్రారంభ విద్యను అభ్యసించారు. అబ్‌రామ్ కుటుంబ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ చిన్నారి త‌న స్కూల్ లో తన తండ్రి లాంటి స్టార్ .. పాఠశాల వార్షికోత్స‌వ వేడుక‌లో అత‌డి ప్ర‌ద‌ర్శ‌న తేజ‌స్సుకు అంద‌రూ ఫిదా అయిపోయారు.

2. ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్ ల‌ కుమార్తె: ఆరాధ్య బచ్చన్


మాజీ ప్రపంచ సుంద‌రి ఐశ్వర్య రాయ్ బచ్చన్ - అభిషేక్ బచ్చన్‌ల వార‌సురాలు ఆరాధ్య బచ్చన్ అంబానీ స్కూల్ విద్యార్తి. ముగ్గురూ తరచుగా పాఠశాల ఫంక్షన్లలో కనిపిస్తుంటారు. ప‌రిస‌రాల్లోని చాలా మంది తల్లిదండ్రులకు స్ఫూర్తినిస్తారు. తన తల్లిదండ్రుల అడుగుజాడల్లో ఆరాధ్య తన పాఠశాల కార్యకలాపాలు, అసైన్‌మెంట్‌లు తెలివిగా పూర్తి చేస్తుంది. వార్షిక దినోత్సవ వేడుకలలో ఎంతో యాక్టివ్ గా విభిన్న పాత్రలలో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. వార్షికోత్స‌వ వేదిక‌పై ఆరాధ్య ప్రద‌ర్శ‌న కూడా ఆక‌ట్టుకుంది.

3. కరీన్ కపూర్- సైఫ్ అలీ ఖాన్ కుమారుడు: తైమూర్ అలీ ఖాన్


ప్రముఖ హిందీ తార‌లు కరీన్ కపూర్ - సైఫ్ అలీ ఖాన్ ల‌ కుమారుడు తైమూర్ అలీ ఖాన్ అంబానీ స్కూల్ లోనే చ‌దువుకుంటున్నాడు. అత‌డు ఫుట్‌బాల్ మైదానంలో అలాగే వార్షికోత్స‌వ‌ వేదికపై క‌నిపించి ఆక‌ట్టుకున్నాడు. చిన్నారి బాల‌కుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవాడు అయినా కానీ..అత‌డి వ్యక్తిత్వం ఎంతో ఆక‌ర్షిస్తుంది.

4. కరణ్ జోహార్ పిల్లలు: యష్ , రూహి జోహార్


భారతదేశంలోని ప్రముఖ ద‌ర్శ‌క‌నిర్మాతలలో ఒకరైన క‌ర‌ణ్ జోహార్ వార‌సులు యష్ , రూహి జోహార్ అంబానీ స్కూల్ లో చ‌దువుకుంటున్నారు. భారతదేశంలోని అగ్రశ్రేణి IB పాఠశాలల్లో ఒక‌టైన అంబానీ స్కూల్ లో వార‌సుల చ‌దువులపై క‌ర‌ణ్ ఎంతో ఉత్సుక‌త‌తో ఉంటాడు. క‌ర‌ణ్ పిల్లలు కూడా అనేక పాఠశాల కార్యక్రమాలలో సంద‌డిగా క‌నిపించారు. వారి ప్రతిభను ప్రదర్శించారు.

5. హృతిక్ రోషన్- సుస్సానే ఖాన్ పిల్లలు: హృదాన్, హ్రేహాన్


మాజీ దంపతులు హృతిక్ - సుస్సానే తమ ఇద్దరు కుమారులు హృదయ్ రోషన్ నాద్, హ్రేహాన్ రోషన్ ల‌ను ధీరూభాయ్ అంబానీ స్కూల్‌లో చేర్పించారు. హృతిక్ -సుస్సానే తమ బిజీ షెడ్యూల్‌ల నుండి విరామం తీసుకుని తమ పిల్లల ముఖ్యమైన పాఠశాల ఈవెంట్‌లు, సమావేశాలలో చురుకుగా పాల్గొనడానికి సమయాన్ని వెచ్చించడం అసాధారణ విష‌యం.

6. అమీర్ ఖాన్ - కిరణ్ రావుల‌ కుమారుడు: ఆజాద్ రావ్ ఖాన్


ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ - కిరణ్ రావు దంప‌తుల వార‌సుడు ఆజాద్ రావ్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నాడు. బ్రేకప్ అయినా కానీ అమీర్- కిరణ్ లు ఆజాద్ రావ్ ఖాన్ కి సహ-తల్లిదండ్రులు. ఆజాద్ రావు తరచుగా పాఠశాల నాటకాలలో ప్రదర్శన ఇవ్వడం, పాఠశాల ఫుట్‌బాల్ జట్టులో ఆట‌గాడిగా పాల్గొనడం వీక్షించాం.

7. మహేష్ భూపతి - లారా దత్తాల కుమార్తె: సైరా భూపతి


లారా దత్తా - మహేష్ భూపతి బాలీవుడ్‌లో అత్యంత గౌరవప్రదమైన జంట. తమ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశపూర్వకంగా మీడియాలో తక్కువగా క‌నిపిస్తారు. అయితే ప్రస్తుతం ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చేరిన వారి ముద్దుల కూతురు సైరా భూపతితో ఈ జంట తరచుగా కనిపిస్తారు.

స‌చిన్ టెండూల్క‌ర్ వార‌సులు సారా టెండూల్క‌ర్, అర్జున్ టెండూల్క‌ర్ కూడా ధీరూభాయ్ అంబానీ స్కూల్ లోనే చ‌దువుకున్నారు. అలాగే అజ‌య్ దేవ‌గ‌న్ కుమార్తె నైసా దేవ‌గ‌న్ ఇదే స్కూల్ లో విద్యాభ్యాసం సాగించింది.

స్టార్ కిడ్స్ ధీరూభాయ్ అంబానీ స్కూల్‌కి ఎందుకు వెళతారు?

అంబానీ స్కూల్ ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలలో ఒకటి. వార్షిక రుసుము రూ. 1,70,000 నుండి 4,48,000. ఈ పాఠశాలలో త‌మ పిల్ల‌లను చ‌దివించేందుకు సెల‌బ్రిటీలు ఎంతో ఆస‌క్తిగా ఉంటారు.