అలాంటి సీన్స్ కి ఓకే.. కానీ కండీషన్స్ అప్లై అంటున హీరోయిన్..!
హీరోయిన్ గా రాణించాలంటే కేవలం అభినయంతోనే మెప్పించే తారలు కొందరే ఉంటారు
By: Tupaki Desk | 23 Jan 2024 2:30 PM GMTహీరోయిన్ గా రాణించాలంటే కేవలం అభినయంతోనే మెప్పించే తారలు కొందరే ఉంటారు. అయితే చాలామంది హీరోయిన్స్ మాత్రం ఎక్కువగా గ్లామర్ సైడ్ ఎక్కువ దృష్టి పెడతారు. ఆడియన్స్ ని తమ అందంతో పడేయాలనే ప్లాన్ లోనే ఎక్కువమంది హీరోయిన్స్ ఫోకస్ ఉంటుంది. ఇక అందుకు తగినట్టుగానే కథకు అవసరం అనిపిస్తే లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ చేస్తుంటారు. అలా సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అనుకున్న వారికి ఎక్కువ అవకాశాలు వస్తాయి.
అయితే ఇండస్ట్రీకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరోయిన్స్ ముందు గ్లామర్ విషయంలో ఆచి తూచి అడుగులేసినా తర్వాత ఛాన్స్ ల కోసం గ్లామర్ గేట్లు ఎత్తేయాల్సిందే. ఇదే క్రమంలో రెండేళ్ల క్రితం ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ తో తెలుగు తెరకు పరిచయమైన ఒక అమ్మడు ఆ సినిమా హిట్ తో అరడజను పైగా సినిమా అవకాశాలు అందుకుంది. అయితే ఆ సినిమాలు కాస్త నిరాశపరచడంతో ఇప్పుడు కెరీర్ లో వెనకబడింది.
ఛాన్స్ ల కోసం ఈమధ్య గ్లామర్ షో చేస్తూ ఫోటో షూట్స్ కూడా చేస్తున్న ఆ అమ్మడు ఇక మీదట సినిమాల్లో స్కిన్ షోకి రెడీ అనేస్తుంది. అంతేకాదు కుదిరితే లిప్ లాక్ సీన్స్ కి ఓకే అనేస్తుంది. అయితే అన్నిటికీ ఓకే కానీ కండీషన్స్ అప్లై అనేస్తుంది. ఇంతకీ అమ్మడు పెట్టిన కండిషన్ ఏంటంటే తాను లిప్ లాక్ కి ఓకే కానీ కాస్త స్టార్ రేంజ్ ఉన్న హీరో తో అయితేనే అలాంటివి చేస్తా అంటుంది.
కుదిరితే స్టార్ హీరో.. లేదంటే మీడియం రేంజ్ హీరో అయినా సరే ఓకే కానీ మరీ కొత్త వారితో లిప్ లాక్ అంటే కష్టమని అంటుందట. కథ నచ్చితే ఎలాంటి సీన్స్ అయినా చేసేందుకు రెడీ కానీ అది కాస్త కూస్తో ఒక రేంజ్ ఉన్న హీరో అయ్యి ఉండాలని మెలిక పెట్టిందట. మరి అమ్మడు పెట్టిన కండీషన్స్ కి ఓకే అంటే చాలు అమ్మడు కూడా రొమాంటిక్ సీన్స్ రెడీ అనేస్తుంది. మరి ఈ ఆఫర్ ఇచ్చాక అయినా ఆమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. హీరోయిన్స్ విషయంలో పోటీని అర్థం చేసుకున్న ఈ హీరోయిన్ గ్లామర్ షో చేస్తేనే కానీ ఇక్కడ పని అవ్వదని త్వరగానే కనిపెట్టింది. మరి ఈ మార్పు అమ్మడి కెరీర్ కు ఏవిధంగా ఉపయోగపడుతుందో చూడాలి.