సమ్మర్ నుంచి హీరోయిన్లు ఇలా కూల్!
బయట ఎండలు ఏ రేంజ్ లో రప్పాడిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. భానుడి భగభగలు మామూలుగా లేవు.
By: Tupaki Desk | 15 April 2024 12:30 AM GMTబయట ఎండలు ఏ రేంజ్ లో రప్పాడిస్తున్నాయో చెప్పాల్సిన పనిలేదు. భానుడి భగభగలు మామూలుగా లేవు. మే లో నమోదవ్వాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ లోనే మొదలైపోయియా. ఇక మేలో సన్నివేశం ఊహించుకుంటేనే భయానకంగా ఉంది. మరి అందమైన హీరోయిన్లు ఛర్మంపై అంత తీవ్రమైన వేడి పడితే రంగు మారిపోదు. పాల నురుగుల అందం కాస్త! నలుపు వర్ణంలోకి వచ్చేయదు. మరి బ్యూటీలు ఎండ నుంచి తమని తాము ఎలా కాపాడుకుంటున్నారో తెలుసా? సమ్మర్ కోసమంటూ కొంత మంది భామలు ప్రత్యేకమైన షెడ్యూల్ వేసుకుని తిని..తాగే పదార్ధాల దగ్గర నుంచి ప్రతీ విషయంలో ఎంతో కేర్ పుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. జాక్వెలిన్ పెర్నాండేజ్..యామీగౌతమ్..అలియాభట్ భామల కేరింగ్ చూస్తే..
జాకీ ఈ సీజన్‌లో పొద్దున్నే బొప్పాయి పండుపై నిమ్మరసం పిండుకుని తింటుందిట. దాంతోపాటే ఒక గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు తాగుతుందిట. సలాడ్స్- ఇంట్లో వండిన ఫుడ్ మాత్రమే తీసుకుంటుందిట. ఆహారంలో చిరుధాన్యాలు- కూరగాయలు ఉండేలా చూసుకుంటుందిట. ఈసీజన్ లో వర్కౌట్లు తక్కువగా చేస్తుందిట. పైలెట్స్- డ్యాన్స్‌కి ప్రాధాన్యం ఇస్తుందిట. వాటర్ బాటిల్ వెంట ఎప్పుడూ ఉంచుకుంటుందిట. తేలికపాటి దుస్తులు ధరిస్తుందిట. ఇక యామిగౌతమీ కొబ్బరినీళ్లతో మసాజ్ చేయించుకుంటుదిట.
శరీరమంతా చల్లదనం నిండి ఉండే దుస్తులే ధరిస్తుందిట. షూట్ ఉంటే తప్ప లేకపోతే మ్యాకప్ జోలికి వెళ్లదంట. బయటకు వెళ్లే మాత్రం స్కిన్ లోషన్స్ మాయిశ్చరైజర్ తప్ప అప్లై చేస్తుందిట. కొబ్బరినీరు ఎక్కువగా తాగుతుందిట. కొబ్బరి నీరును ఐస్ ట్రేలో ఉంచి కొంత సమయం తర్వాత ఆ ఐస్ క్యూబ్స్‌తో ముఖానికి మసాజ్ చేసుకుంటుదిట. దీనివల్ల అలసట తగ్గుతుంది. అలాగే అలియాభట్ నిమ్మరసం.. కొబ్బరినీళ్లు..మజ్జిగ వంటివి ఎక్కువగా తీసుకుంటుందిట.
అందువల్ల శరీరానికి కావాల్సినంత తేమ దొరుకుతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడకుంటా ఉంటాం. ఎండలోకి వెళ్తే మాత్రం అన్నీ సరంజామాలతో వెళ్తుందిట. సూర్య కిరణం ఒంటిపై పడకుండా తగు జాగ్రత్తలన్నీ తీసుకుం టుందిట. ఇక బయటకు వెళ్తే ఎలాగూ ఏసీ కారులోనే వెళ్తారు. కారు నుంచి దిగిన తర్వాత ఏసీ ఉన్న గదుల్లోనే ఉంటారు. అదీ సంగతి.